COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weekly Horoscope Telugu: జనవరి రెండో వారంలో కొన్ని అత్యంత ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయబోతున్నారు దీని కారణంగా రాబోయే వారం కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంది అంతే కాకుండా ఈ రాశుల వారు వారం మొత్తం శుభవార్తలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక మరికొన్ని రాశుల వారైతే ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. అయితే ఈ వారం ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


మేష రాశి:
మేష రాశి వారికి జనవరి రెండో వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఇంతకుముందు పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. అంతే కాకుండా ఇతరులతో కలిసి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం కోసమే ఎదురు చూస్తున్నా వారు ఈ వారంలో ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడం వల్ల పొందే అవకాశాలున్నాయి. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి మంచి లాభాలు కలుగుతాయి. 


మిథున రాశి:
మిథున రాశి వారికి కూడా జనవరి రెండవ వారం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. ఈ వారం మొత్తం మీరు ఎంతో ఆనందంగా సంతోషంగా గడుస్తారు. దీంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా వీరికి లక్ష్మీ అనుగ్రహం లభించి ఎలాంటి పనులు చేసిన ఊహించని డబ్బు పొందుతారు. కెరీర్ పరంగా అనేక విజయాలు సాధించేందుకు ఈ సమయంలో ప్రణాళికలు అంతే కాకుండా మీ జీవిత భాగస్వామి నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.


సింహరాశి:
సింహరాశి వారికి కూడా జనవరి రెండవ వారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా వృత్తి పనులు చేసే వారికి ఈ భారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చేస్తున్న వారు కూడా ఇంతకుముందు పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి పొందుతారు. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఇది అద్భుతమైన సమయం.


కన్యా రాశి:
ఈ వారం కన్యా రాశి వారికి కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో ఆఫీసులో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. అంతేకాకుండా కొత్త పరిచయాలు ఏర్పడి స్నేహంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక వైవాహిక జీవితం విజయానికి వస్తే ఈ సమయంలో ఇంతకుముందు మీ భాగస్వామితో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఈ సమయంలో తప్పకుండా వెళ్లగలుగుతారు.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


మీన రాశి:
మీన రాశి వారికి ఈ వారం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు. అంతే కాకుండా వీరికి అదృష్టం రెట్టింపవడం కారణంగా ఉన్నతాధికారులను ప్రశంసలు పొందుతారు. దీంతోపాటు కొత్త కొత్త ఆలోచనలతో ఇతరులను ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. మీన రాశి వారికి ఈ వారం లక్ష్మీ అనుగ్రహం లభించింది. కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అఖండ విజయాలు సాధిస్తారు.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter