July Born Personality: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల ఆధారంగా కూడా ఆ వ్యక్తి మనస్తత్వం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతినెలా రాశులు పుట్టిన సమయం వ్యక్తుల స్వభావం పై ఆధారపడి పనిచేస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై లో పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా జూలై నెలలో పుట్టిన వారు కష్టపడి చేసే తత్వం కలవారు. వీరు మల్టీ టాలెంటెడ్ ఏ రంగంలో ఉన్న బాగా రాణిస్తారు అంతేకాదు వీళ్లలో నెగటివిటీకి ఆస్కారం ఉండదు. ఒక్కోసారి వారి ఎమోషన్స్ షేర్ చేయడానికి ఎన్నో కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబం అంటే ఎంతో ప్రేమ వీరికి ఉంటుంది. ఎంతోమంది సక్సెస్ సాధించిన వ్యక్తులు ఈ మాసంలోనే జన్మించారు.


జులై నెలలో నెల్సన్ మండేలా, జేఆర్డీ టాటా వంటి సక్సెస్ సాధించిన బిజినెస్ ,రాజకీయవేత్తలు పుట్టిన నెల. జూలై నెలలోనే ఫేమస్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కూడా జన్మించారు. జ్యోతిష్యం ప్రకారం ఈ నెల కేతు గ్రహంతో సంబంధం ఉన్నది. ముఖ్యంగా ఈ నెలలో పుట్టిన వారు మిథనం లేదా కర్కాటక రాశికి చెందిన వారు ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారు పేరు ప్రఖ్యాతలు త్వరగా సంపాదిస్తారు.


అంతేకాదు జూలై నెలలో పుట్టిన వారు అట్రాక్టివ్ గా ఉంటారు. ఏ రంగంలో ఉన్న బాగా క్రియేటివ్ గా పని చేస్తారు వీళ్లలో కలుపు గొలుబుతనం వల్ల అందరిని ఆకర్షిస్తారు. ఎంత ఓపికగా ఉంటారో వారు ఆగ్రహం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. భాగస్వామికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. వీరితో పెళ్లి అంటేనే అదృష్టం, ఒక్కసారి ప్రేమిస్తే వారిని జీవితాంతం వదలరు. మోసం చేసే ధోరణి వీళ్లలో తక్కువ. కాబట్టి ఎక్కువ నమ్మకం గల వారు కూడా ఈ నెలకు చెందినవారే ఉంటారు.


ఇదీ చదవండి: ఈ 4 తేదీల్లో పుట్టిన వారికి వైవాహిక జీవితం కత్తి మీద సాము వంటిదేనట..!


జూలైలో పుట్టిన నెలలో పుట్టిన వారికి ఇతరులకు సాయం చేసే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరితో స్నేహం చేసే వారికి ఒక వరం వంటిది.  జూలై నెలలో పుట్టిన వారు మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు.ఈ నెలలో పుట్టిన వారు స్వాతంత్రంగా బతకడం కోరుకుంటారు. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను అలవోకగా ఛేదిస్తారు మంచి టీం లీడర్లుగా కూడా రాణిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 


ఇదీ చదవండి: మనీప్లాంట్‌ మొక్క ఈ మూలన పెడితే ధనలక్ష్మి కటాక్షమే.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి