Black threat benefits: ఇటీవల కాలంలో చాలా మంది ఎడమ కాలికి దారం కట్టుకుంటారు. అది కూడా నల్లని రంగు దారం కట్టుకుంటారు. దీని వల్ల దిష్టి తగలదని చెబుతుంటారు. నలుపు రంగును చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు. కానీ ఈ రంగు శనీశ్వరుడికి ఇష్టమైన రంగు. అదే విధంగా ఈ రంగును ధరించిన వాళ్లకు శనీదేవుడు కష్టాలను కల్గించడని చెబుతుంటారు. అందుకే చాలా మంది కాలికి ఎడమ రంగు దారంను కట్టుకొవడం కోసం ఆసక్తి చూపిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా.. నల్లని రంగు దారంను కట్టుకునేటప్పుడు దాన్ని తొలుత మంచి నీటిలో శుభ్రంగా కడుక్కొవాలంట. ఆ తర్వాత దాన్ని.. దేవుడి గదిలో ఉంచి.. మనకు మంచి జరగాలని దండంపెట్టుకుని మరీ దారం కట్టుకొవాలంట. అదే విధంగా మహిళలు.. పీరియడ్స్ సమయంలో లేదా.. ఎవరైన చనిపోయిన ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం.. నల్ల రంగు దారంను తీసివేసి మరల కొత్తదారంను కట్టుకొవాలంట.


అయితే.. నల్ల రంగు దారంను వేసుకొవడం వల్ల నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుందంట.  అంతే కాకుండా.. కొన్ని సమయాలలో ఈ దారం చెడును ముందుగానే గుర్తించి అలర్ట్ చేస్తుందంట. అందుకే నల్లని దారంను చాలా మంది తమ కాళ్లకు వేసుకుంటారు. అయితే.. కొంత మంది నల్లని దారంను ఫ్యాషన్ లాగా భావిస్తున్నారు. కానీ నల్లని దారం అత్యంత పవర్ ఫుల్ గుణాల్ని కల్గి ఉంటుందంట.


అదే విధంగా ఈ దారంను పాదాలకు కట్టుకుంటే.. చెడు కళ్లు మన మీద నుంచి పోతాయంట. అందుకే నల్లని దారంను తప్పనిసరిగా కాళ్లకు కట్టుకొవాలని కొంత  మంది చెబుతుంటారు. అయితే.. ఎవరి నమ్మకాలు వారివి నల్లని దారం వల్ల కొంత మంది మేలు జరిగిందని చెబుతుంటే.. మరికొందరు మాత్రం నల్లని దారం  ఉన్నలేకున్న ఎలాంటి సమస్యలు రావని కూడా చెబుతున్నారు.


Read more: Gita Jayanti 2024: గీతా జయంతి ఎప్పుడు..?.. దీని విశిష్టత.. ఆ రోజున ఏంచేయాలో తెలుసా..?


కానీ నల్లని అనాదీగా కొంతమంది పిల్లలకు చేతికి దిష్టి తగలకుండా.. నల్లని పూసలు, నల్లని దారంను వేయడం మనం చూస్తుంటాం. అందుకే నల్లని దారంను చాలా మంది వేసుకొవడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.