Kaala Bhairava: కాల భైరవుడు శివుని ఉగ్ర రూపంగా చెబుతారు. శత్రువులను ఓడించడానికి కాల భైరవుడిని పూజిస్తారు. కాల భైరవుడిని క్రమం తప్పకుండా పూజిస్తే.. శత్రువులతో పోరాడే శక్తిని పొందుతారనే నమ్మకం. అంతేకాకుండా చేతబడిని కూడా నివారించే శక్తి వస్తుందంటారు. గ్రహాల చెడు కదలికలు, అభ్యంతరకరమైన పరిస్థితులను నివారించాలనుకునే వారు కాలభైరవుడిని పూజించాలి. హిందూ గ్రంథాల ప్రకారం కాల భైరవుడిని శక్తి దేవత కొత్వాల్‌గా పూజిస్తారు. కాలభైరవుని తాంత్రిక తంత్రాల గురించి తెలుసుకుందాం..   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాల భైరవ ఉపాయాలు


కాల భైరవుడిని తాంత్రికుల దేవుడు అని పిలుస్తారు. రాత్రిపూట ఆయనను పూజిస్తారు. మరుసటి రోజు ఉదయం పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత భైరవ బాబాకు బూడిదను సమర్పిస్తారు. కాలభైరవుని ఆరాధనలో నల్ల కుక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. నల్ల కుక్కను నమస్కారం చేయడం వల్ల కాల భైరవుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని అంటారు. మీరు కూడా కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.


మార్గాలు ఇవే.. 


  • భైరవ్ బాబాను ప్రసన్నం చేసుకోవడానికి శనివారం మీ నగరంలో అలాంటి భైరవ దేవాలయానికి వెళ్లి పూజలు చేయండి. ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున గుడికి వెళ్లి భైరవబాబాకు పచ్చిమిర్చి, కొబ్బరి, నూనె, పాయసం, జిలేబి సమర్పించి పూజించాలి. 

  • భైరవ్ బాబాను ప్రసన్నం చేసుకోవడానికి శనివారం ఆవనూనెతో పాపడ్, పకోరలు, పాయలు మొదలైన వాటిని తయారు చేసి ఆదివారం పేదలకు పంచండి. ఇలా చేయడం వల్ల కాలభైరవుడు మీ పట్ల మరింత సంతోషిస్తాడు. 

  • బుధవారం 125 గ్రాముల నల్ల నువ్వులు, 125 గ్రాముల నల్ల నువ్వులు, 11.11 రూపాయలను 1.25 మీటర్ల నల్ల గుడ్డ కట్టలో కట్టి కాలభైరవుని ఆలయానికి ఇవ్వండి. 

  • భైరవ్ బాబాకు వరుసగా ఐదు గురువారాలు ఐదు నిమ్మకాయలను సమర్పించండి.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.) 


Also Read: Team India: ఒకే ఏడాదిలో 8 మంది కెప్టెన్లు.. కేఎల్ రాహుల్ ఫ్లాప్‌ షో.. సెలక్టర్లు ఇలా చేసినందుకే..


Also Read: Godfather OTT: చిరు 'గాడ్ ఫాదర్' ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook