Wednesday Puja tips: వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవతను పూజిస్తారు. బుధవారం వినాయకుడిని పూజించడం అనవాయితీ. ఈ రోజున గణపతిని (Lord Ganesha) భక్తి శ్రద్దలతో పూజిస్తే.. మీ పనిలో ఎటువంటి ఆటంకం కలగదు. అంతేకాకుండా అన్ని రకాల భాదలు  దూరమవుతాయి. బుధవారం వినాయకుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గణపతిని ఇలా పూజించండి
>> గణేశుడికి అనేక అవతారాలు ఉన్నాయి. వాటిలో అష్ట వినాయకుడు అత్యంత ప్రసిద్ధుడు. అయితే బుధవారం సిద్ధి వినాయకుడిని పూజించడం ఉత్తమంగా భావిస్తారు. దీని వల్ల మీ అదృష్టం ప్రకాశిస్తుంది. 
>> పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు సిద్ధతేక్ పర్వతంపై వినాయకుడి యెుక్క సిద్ధి వినాయక రూపాన్ని పూజించడాన్ని నమ్ముతారు. అప్పుడు బ్రహ్మ ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ విశ్వాన్ని సృష్టించాడట.
>> గణేశుడి యెుక్క సిద్ధి వినాయక రూపం అత్యంత ప్రజాదరణ పొందినదిగా భావిస్తారు. సిద్ధి వినాయకుడికి రిద్ధి మరియు సిద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. 
>> బుధవారం నాడు, గణపతి యొక్క సిద్ధి వినాయక రూపాన్ని పూజించి.. 21 పత్రాలను సమర్పించండి. 
>> సిద్ధి వినాయకుడిని షోడోపచారాలతో పూజించిన తర్వాత,...ధూపం, దీపాలు వెలిగించండి. అనంతరం గణేష్ చాలీసా పఠించండి. ఇప్పుడు వినాయకుడికి లడ్డూలు నైవేద్యంగా పెట్టి చివరగా హారతి  ఇవ్వండి.  
>> బుధవారం నాడు వినాయకుడిని సక్రమంగా పూజించడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి.


Also Read: Angaraka Yogam: 37 ఏళ్ల తరువాత ఏర్పడిన అంగారక యోగం.. నేటితో ముగింపు.. ఇక ఈ 3 రాశుల వారికి అన్నీ మంచి రోజులే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook