Mangal-Rahu Yuti: ఆస్ట్రాలజీలో గ్రహాల మార్పు మెుత్తం 12 రాశిచక్రాలపై శుభ లేదా అశుభ ప్రభావాలను చూపిస్తుంది. ఆ సమయంలో ఒక గ్రహం మరొక గ్రహంతో కలవడాన్నే యుతి అంటారు. ఇప్పటివరకు మేషరాశిలో ఉన్న కుజుడు ఇవాళ అంటే ఆగస్టు 10న వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. గత నెల 27న కుజుడు మేషరాశిలో సంచరించడం వల్ల అంగారక యోగం (Angarak Yog In Aries) ఏర్పడింది. మేషరాశిలో ఈ అంగారక యోగం 37 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఇది నేటితో ముగుస్తుంది. దీంతో మేషరాశివారు ఊపిరి పీల్చుకుంటారు.
అంగారక యోగాన్ని అశుభంగా భావిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాహు, అంగారక గ్రహాలను అగ్ని గ్రహాలుగా పరగణిస్తారు. ఈ రెండింటి కలయిక వల్లే అంగారక యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశులవారికి శుభం, కొందరికి అశుభంగా ఉంటుంది.
ఈ రాశుల వారికి విముక్తి
ఆస్ట్రాలజీ ప్రకారం, ఒక గ్రహం తన స్వంత రాశిలో ఉన్నప్పుడు... అది మరింత శక్తివంతంగా మారుతుంది. అదేవిధంగా ప్రస్తుతం కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలో ఉన్నాడు. దీని వల్ల మేషరాశిలో ఏర్పడిన అంగారక యోగం వృషభ, తుల, సింహ రాశులకు కష్టాలను కలగిస్తుంది. అయితే నేటి నుండి ఈ మూడు రాశుల వారికి ఈ యోగం తొలగిపోతుంది. దీంతో ఈ మూడు రాశుల వారు ఊపిరి పీల్చుకుంటారు.
Also Read: Venus Transit Effect: కర్కాటకంలో శుక్ర సంచారం... ఈ 3 రాశులవారికి జాక్ పాట్ ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook