Yearly Horoscope 2023: ప్రస్తుతం 2022 చివరి నెల డిసెంబర్‌ నడుస్తోంది. 2023 సంవత్సరం ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి చాలా మంది వచ్చే సంవత్సరంలో వారి రాశికి సంబంధించిన ఫలలాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ సంవత్సరంలో చాలా గ్రహాలు తమ సొంత రాశులను వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా చాలా మంది జీవితాల్లో మార్పులు జరిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా  మిథునరాశి వారికి లాభదాయకంగా ఉండబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వచ్చే సంవత్సరంలో ఈ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృత్తి పరంగా:
మిథున రాశి వారు 2023 సంవత్సరంలో సానుకూల ఫలితాలను పొందుతారు. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి స్థానం మారడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారికి ఈ క్రమంలో ప్రమోషన్‌ కూడా లభించే అవకాశాలున్నాయి. కార్యక్షేత్రంలో పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి.


ఆర్థికస్థితి:
2023 సంవత్సరంలో మిథున రాశి వారి ఆర్థికస్థితిలో తీవ్ర మార్పులు జరగబోతున్నాయి. ఈ రాశి వారు జనవరి తర్వాత నెల నుంచి అధికంగా ప్రయోజనాలు కలిగి ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఏప్రిల్, ఆగస్టు మధ్య ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఆర్థిక విషయాల పట్ల తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


ప్రేమ:
మిథున రాశి వారు 2023 సంవత్సరంలో ప్రేమ జీవితంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జనవరి నెలలో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ప్రేమ విషయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ తర్వాత మీ సంబంధం మెరుగుపడుతుంది.


ఆరోగ్యం:
ఈ రాశివారు తప్పకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆరోగ్యం బలహీనపడవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలీక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. అయితే 2023 చివరి నెలలో ఆరోగ్యం కుదుట పడే ఛాన్స్‌ కాబట్టి అప్పడి దాకా తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


విద్య:
మిథున రాశి విద్యార్థులకు 2023 సంవత్సరం బాగానే ఉంటుంది. అయితే రాహు-కేతువుల వల్ల విద్యకు సంబంధించి కొన్ని సవాళ్లను ఎదుర్కోనే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


Also Read: SBI Interest Rate Hike: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు 


Also Read: CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook