Yogini Ekadashi 2023 date and time:  ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున యోగిని ఏకాదశిని జరుపుకుంటారు. ఈరోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. యోగినీ ఏకాదశి రోజున శ్రీ హరిని పూజించడం వల్ల మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీరు మరణానంతరం శ్రీమహావిష్ణువు పాదాల చెంతకు చేరుకుంటాడు. యోగినీ ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల 88 వేల మంది బ్రాహ్మణులకు దానం చేయడంతో సమానంగా భావిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యోగినీ ఏకాదశి తిథి మరియు శుభ సమయం
ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి జూన్ 13 ఉదయం 9.28 గంటలకు ప్రారంభమై.. జూన్ 14 ఉదయం 8.48 గంటలకు ముగుస్తుంది.ఉదయ తిథి ప్రకారం, జూన్ 14న యోగిని ఏకాదశి వ్రతం జరుపుకుంటారు. 


యోగినీ ఏకాదశి ఈ రాశుల వారికి శుభప్రదం 
మిధునరాశి
యోగినీ ఏకాదశి మిథునరాశి వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారవేత్తలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది 
సింహం
సింహ రాశి వారికి ఊహించని లాభాలను ఇస్తుంది యోగినీ ఏకాదశి. మీరు కెరీర్ లో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. మీకు ప్రతి పనిలో అదృష్టం తోడవుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. 


Also Read: Shani Chandra yuti 2023: ఈరోజు నుంచి వీరికి అస్సలు టైం కలిసి రాదు.. ఇందులో మీ రాశి ఉందా?


కన్య
యోగినీ ఏకాదశి వల్ల జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఎలాంటి కార్యన్నైనా సులభంగా పూర్తి చేస్తారు. మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. 


Also Read: Shani Dev: శనివారం ఉదయం ఈ దృశ్యాలు కనిపిస్తే.. మీపై శనిదేవుడి ఆశీస్సులు ఉన్నట్లే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook