Shani Dev: శనివారం ఉదయం ఈ దృశ్యాలు కనిపిస్తే.. మీపై శనిదేవుడి ఆశీస్సులు ఉన్నట్లే..!

Shani Dev Puja: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఈయనను న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు.  శని దేవుడి అనుగ్రహం పొందడానికి శనివారం చాలా మంచి రోజు. ఈరోజున మీకు ఈ దృశ్యాలు కనిపిస్తే మీపై శని కటాక్షం ఉన్నట్లే. అవేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2023, 03:23 PM IST
Shani Dev: శనివారం ఉదయం ఈ దృశ్యాలు కనిపిస్తే.. మీపై శనిదేవుడి ఆశీస్సులు ఉన్నట్లే..!

Shani Dev Upay: హిందూ మతంలో శనివారం వెంకటేశ్వరస్వామితోపాటు శనిదేవుడికి కూడా అంకితం చేయబడింది. శనివారం నాడు శనిదేవుని ఆరాధించడం, శనికి ఆవనూనె నైవేద్యంగా పెట్టడం, దానం చేయడం వంటి కార్యాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం మంచి రోజు. 

శని అనుగ్రహం ఉంటే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మీకు డబ్బు, పదవి, మంచి ఆరోగ్య లభిస్తుంది. శని అనుగ్రహానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. శనివారం ఉదయం ఇవి కనిపిస్తే శనిదేవుడి కటాక్షం మీకు ఉన్నట్లే. అవేంటో తెలుసుకుందాం. 

శని అనుగ్రహానికి సంకేతాలు
** శనివారం తెల్లవారుజామున స్వీపర్ ఊడుస్తూ కనిపిస్తే అది చాలా శుభప్రదం. మీరు ఏదైనా గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని అర్థం. వీలైతే మీకు తోచినంతగా స్వీపర్‌కి దానం చేయండి. 
** ఒక బిచ్చగాడు లేదా పేదవాడు శనివారం ఉదయం మీ ఇంటికి వస్తే.. అతన్ని ఉత్తచేతులతో పంపకండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి సంతోషించి.. మీకు అపారమైన సంపదను ఇస్తాడు. 
** నల్ల కుక్కను శని దేవుడి వాహనంగా భావిస్తారు. మీరు శనివారం ఉదయం నల్ల కుక్కను చూసినట్లయితే.. మీకు ఏదో ఒక శుభవార్త అందుతుందని అర్థం. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. నల్లకుక్కకు రొట్టె పెట్టడం వల్ల శనిదేవుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి.
** శనివారం నల్ల కాకిని చూడటం కూడా మంచిది. ఆరోజున నల్లకాకి అరవడం కూడా శుభసూచికంగా భావిస్తారు. ఈరోజున కాకులకు ఖచ్చితంగా బ్రెడ్ లేదా ఆహారాన్ని పెట్టండి. 

Also Read: Mangal Gochar 2023: జూలై 1 వరకు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా?

Also Read: Shukra Gochar 2023: రాబోయే 29 రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News