Yogini Ekadashi 2022: యోగినీ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
Yogini Ekadashi Vrat 2022: యోగినీ ఏకాదశి పాటించడం వల్ల మనిషి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు. యోగినీ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.
Yogini Ekadashi Vrat 2022: ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు. యోగినీ ఏకాదశి వ్రతం గురించి, శ్రీకృష్ణుడు స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వేలాది మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుందని, ఆ వ్యక్తి చేసిన పాపాలన్నీ కూడా హరిస్తాయని చెప్పాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు. ఈ సంవత్సరం యోగిని ఏకాదశి వ్రతం జూన్ 24, శుక్రవారం నాడు ఆచరించబడుతుంది. యోగినీ ఏకాదశి (Yogini Ekadashi 2022) రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని నియమానుసారంగా పూజించాలి.
యోగినీ ఏకాదశి వ్రత పూజ శుభ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి జూన్ 23 రాత్రి 09:41 నుండి ప్రారంభమై జూన్ 24 రాత్రి 11:12 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం, జూన్ 24న యోగినీ ఏకాదశి ఉపవాసం మరియు జూన్ 25 ఉదయం పారణ ఉంటుంది.
ఏకాదశి రోజున ఈ పని చేయకండి
>> యోగినీ ఏకాదశి మాత్రమే కాదు, అన్ని ఏకాదశి రోజుల్లో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మీరు ఉపవాసం ఉండకపోయినా.. కొన్ని నియమాలను పాటించడం వల్ల జీవితంలోని అనేక సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
>> ఏకాదశి రోజు ఎవరికీ అబద్ధాలు చెప్పకండి, ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. ఈ రోజు మీ మనస్సులో ఎలాంటి చెడు మరియు ప్రతికూల ఆలోచనలు రానివ్వకండి. లేకుంటే కఠిన ఉపవాసం, పూజలు చేసినా పూర్తి ఫలితం లభించదు.
>> పొరపాటున కూడా ఏకాదశి రోజున నాన్ వెజ్-ఆల్కహాల్ తీసుకోకండి. ఈ రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి.
>> ఏకాదశి రోజున అన్నం తినడం కూడా నిషిద్ధమని చెబుతారు.
>> ఏకాదశికి ఒకరోజు ముందు బ్రహ్మచర్యం పాటించండి. అలాగే వీలైతే నేలపై పడుకోండి.
Also Read: Vastu Tips: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ పని చేస్తే.. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.