COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Venus, Saturn Transit 2023 Effects On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం లో గ్రహాలు, నక్షత్రాల సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు సంచారం చేయడం వల్ల రాశుల వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో నక్షత్రాలు సంచారం చేయడం కారణంగా అలాంటి ప్రభావమే పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  అయితే గ్రహ, నక్షత్రాల సంచారాలకు నవంబర్ నెల ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పొచ్చు. ఈ నెలలో కొన్ని పెద్ద గ్రహాలు సంచారం చేయడం కాకుండా తిరుగమన స్థితిలో తిరగబోతున్నాయి. ముఖ్యంగా శుక్ర గ్రహం నవంబర్ 3న సింహరాశిని వదిలి కన్యారాశిలోకి సంచారం చెయ్యబోతోంది. ఆ తర్వాత శని గ్రహం 140 రోజుల తర్వాత నవంబర్ 4వ తేదీన కుంభరాశిలోకి తిరోగమనంచేయబోతోంది. అయితే ఈ గ్రహ సంచారాల ప్రభావం అన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాలపై పడబోతోంది. ఈ గ్రహాల సంచారం కారణంగా ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:
మేష రాశి వారికి నవంబర్ నెల ఎంతో ప్రాముఖ్యమైనదిగా చెప్పొచ్చు. ఈ రాశి వారికి శుక్ర, శని గ్రహాల సంచారాలు ఎంతో శుభప్రదంగా మారుతాయి. ఈ సమయంలో మేష రాశి వారికి డబ్బు పరంగా ఎలాంటి డోకా ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో జీవితంలో ముఖ్యమైన మార్పులు పొందుతారు అంతే కాకుండా కుటుంబంతో కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగాలు మారడమే కాకుండా కొత్త ప్రమోషన్స్ కూడా పొందుతారు.


మిధున రాశి:
శుక్ర శని గ్రహాల సంచారం కారణంగా మిధున రాశి వారికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి అదృష్టం రెట్టింపబడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. దీంతోపాటు వీరు కొంత కష్టపడి పనులు చేయడం వల్ల అపారమైన విజయాలు పొందుతారు. ఇక ఎప్పట్నుంచో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చట్టపరమైన వివాదాలనుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎలాంటి పనులు చేయడానికి అయినా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు! 


మకర రాశి:
ఈ రెండు సంచారాల కారణంగా మకర రాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందడమే కాకుండా.. పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తిని కూడా సొంతం చేసుకుంటారు. ఇక ఆర్థికంగా కూడా ఈ సమయంలో ఎలాంటి లోటు ఉండదు. కష్టపడి పనులు చేయడం వల్ల ఇలాంటి ఫలితాలు అయినా సులభంగా పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు భవిష్యత్తు కోసం ఇప్పటినుంచి మంచి పనులు చేస్తారు.


Also Read: Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook