12 teams qualified directly for T20 World Cup 2024: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2022 చివరి దశకు చేరింది. సూపర్ 12లో పసికూన జట్లు కూడా అద్భుతంగా పోరాడి పెద్ద జట్లకు భారీ షాకిచ్చాయి. డిఫెండింగ్ ఛాంపియిన్ ఆస్ట్రేలియా, తొలి టైటిల్ కైవసం చేసుకోవాలనుకున్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టాయి. గ్రూప్‌ 1 నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ టీమ్స్ సెమీస్ చేరగా.. గ్రూప్‌ 2 నుంచి భారత్‌, పాకిస్తాన్‌ జట్లు సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాయి. ఇక సెమీస్ మ్యాచుల కోసం ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రపంచకప్‌ 2022 ముగియకముందే.. ప్రపంచకప్‌ 2024లో ఆడే 12 జట్లు ఏవో తేలిపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్ 12 మ్యాచులు ఈ ఏడాది సెమీస్ చేరే జట్లను నిర్ణయించడం మాత్రమే కాకుండా.. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించే జట్లను కూడా నిర్ణయించాయి. 2024లో ఆడే 12 జట్లను ప్రస్తుత సెమీస్ మ్యాచులు తేల్చాయి. ఆతిథ్య జట్టుగా వెస్టిండీస్ మరియు యూఎస్ఏ నేరుగా అర్హత సాధించాయి. దక్షిణాఫ్రికాపై విజయంతో నెదర్లాండ్స్ కూడా ఈ జాబితాలో చేరింది. ఇక ఈ ఏడాది ప్రపంచకప్‌లో టాప్ 8గా నిలిచిన జట్లు 2024 మెగా టోర్నీకి అర్హత సాధించాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ కారణంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా అర్హత సాధించాయి.


టీ20 ప్రపంచకప్ 9వ ఎడిషన్ (టీ20 ప్రపంచకప్‌ 2024) అన్నిటికంటే ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే.. 2024లో రికార్డు స్థాయిలో 20 జట్లు ఆడబోతున్నాయి. ఈ టోర్నీకి వెస్టిండీస్ మరియు యూఎస్ఏ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. దాంతో 12కు వెస్టిండీస్,  యూఎస్ఏ నేరుగా అర్హత సాధించాయి. ఇప్పటివరకు మెగా టోర్నీలో 16 జట్లు ఆడుతున్న విషయం తెలిసిందే. క్వాలిఫైయర్ మ్యాచుల అనంతరం సూపర్ 12లో 12 టీమ్స్ ఆడుతున్నాయి. 



ప్రపంచకప్ 2024కు అర్హత సాధించిన జట్లు ఇవే: 
భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిల్యాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఎస్ఏ, వెస్టిండీస్. 


Also Read: భారత్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ చూడాలనుంది.. అదే జరిగితే..! అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు


Also Read: Samantha Ruth Prabhu Pics: మయోసైటిస్‌తో పూర్తిగా మారిన సమంత.. ఫొటోస్ చూస్తే గుండె బరువెక్కడం పక్కా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook