Want to See India vs Pakistan Final says Shoaib Akhtar: టీ20 ప్రపంచకప్ 2022లో ఎన్నో రసవత్తర పొరులు, అద్భుతాలు జరిగాయి. పసికూన జట్లు కూడా అద్భుతంగా పోరాడి బడా జట్లకు షాకిచ్చాయి. డిఫెండింగ్ ఛాంపియిన్ ఆస్ట్రేలియా సెమీస్ చేరలేదు. ఐసీసీ టోర్నీలలో అదృష్టం కలిసిరాని దక్షిణాఫ్రికా ఎప్పటిలానే ఇంటిదారి పట్టింది. గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్.. గ్రూప్ 2 నుంచి భారత్, పాకిస్తాన్ పొట్టి టోర్నీ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాయి. నవంబర్ 9, 10 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచులు ఆడుతాయి.
టీ20 ప్రపంచకప్ 2022లో ఆడిన మొదటి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. పసికూన జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడింది. దీంతో పాక్ ఇక సెమీస్ చేరాడని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సెమీ ఫైనల్ చేరింది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన పాక్.. తర్వాతి మూడు మ్యాచులు గెలిచింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి పాలవడంతో.. పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరింది. భారత్ మాత్రం ఐదు మ్యాచులో ఏకంగా నాలుగు గెలిచి సెమీస్ చేరింది. సెమీ ఫైనల్ మ్యాచులలో భారత్, పాకిస్తాన్ గెలిస్తే.. ఫైనల్లో తలపడుతాయి.
భారత్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఆడితే చూడాలనుందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'పాకిస్తాన్ ప్లేయర్స్ నేను తప్పు అని నిరూపించారు. తొలి రౌండ్‌లోనే పాక్ నిష్క్రమించనందుకు నెదర్లాండ్స్‌కు ధన్యవాదాలు. ఈ మాట నేను అనకూడదు.. నిజానికి దక్షిణాఫ్రికా సెమీస్ చేరాలి. మంచి అవకాశాన్ని ప్రొటీస్ వదులుకుంది. ఇక సెమీస్‌లో భారత్, పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటున్నా. నాకైతే ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడితే చూడాలనుంది. ఇదే జరిగితే ఐసీసీ, బ్రాడ్‌కాస్టర్లు ప్రయోజనం పొందుతారు' అని అన్నాడు.
'సూపర్ 12 దశలోనే పాకిస్తాన్ ఇంటికి వచ్చేస్తుంది. భారత్ కూడా పెద్ద తీస్‌మార్ ఖాన్ జట్టేమీ కాదు. మహా అయితే సెమీస్‌లో ఆడుతుంది. అక్కడ కచ్చితంగా టీమిండియా ఓడుతుంది' అని షోయబ్ అక్తర్ ఇదివరకు అన్నాడు. ఇప్పుడు పాక్ సెమీస్ చేరడంతో తన అంచనా తప్పు అయిందని ఒప్పుకున్నాడు. భారత్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఆడితే బాగుంటుంది అంటున్నాడు.
Also Read: T20 World Cup 2022 టాప్ రన్ స్కోరర్స్, హైయెస్ట్ వికెట్ టేకర్స్ వీరే.. భారత్ నుంచి ఒక్కరు లేరు!
Also Read: Samantha Ruth Prabhu Pics: మయోసైటిస్‌తో పూర్తిగా మారిన సమంత.. ఫొటోస్ చూస్తే గుండె బరువెక్కడం పక్కా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook