ముంబై: ఆదివారం ముంబై వాంఖేడ్ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా వరుసగా రెండు విజయాలతో జోరుమీదుండగా.. శ్రీలంక ఎలాగైనా ఈ ఒక్క మ్యాచ్ అన్నా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. టీమిండియా మొదటి మ్యాచ్లో 93 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్లో 88 పరుగుల తేడాతో లంకను చిత్తుచేసింది. భారత జట్టు బ్యాటింగ్లో, బౌలింగ్లో సమిష్టిగా రాణిస్తుండటంతో గెలుపు సాధ్యమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో టీ20 మ్యాచ్


టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. కేఎల్ రాహుల్ కూడా అర్థ సెంచరీతో మెప్పించాడు. ధోనీ, మనీష్ పాండే బ్యాటింగ్లో.. స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ లు బౌలింగ్లో రాణిస్తున్నారు. 


చాహల్ అరుదైన రికార్డు


యజువేంద్ర చాహల్ శ్రీలంకతో శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో రికార్డు సృష్టించాడు. ఇయర్ ఆఫ్ క్యాలెండర్లో టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 11 మ్యాచులు ఆడిన చాహల్ 23వికెట్లతో ముందంజలో ఉన్నాడు. రెండో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 17 వికెట్లతో, టీమిండియా పేస్ బౌలర్ బుమ్రా 11 వికెట్లతో  9వ స్థానంలో,  కుల్దీప్ 7 వికెట్లతో 13వ స్థానంలో నిలిచాడు. 


ఇప్పటికే భారత్ టెస్ట్ సిరీస్ ను 1-0తో, వన్డే సిరీస్ ను 2-1 తేడాతోనూ గెలిచింది. ఇప్పుడు 3-0తో టీ20 గెలిచి లంకను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. రెండు టీ20ల మ్యాచుల్లో ఓడిపోయిన శ్రీలంక ఆఖరి మ్యాచైనా గెలుపుతో ముగించాలని ప్రయత్నిస్తోంది.