Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ బ్యాట్ నుంచి లాఫ్టెడ్ షాట్..వీడియో వైరల్..!
Sachin Tendulkar: వయసు పెరుగుతున్నా.. అతడి ఆట లయ తప్పలేదు. చూడ చక్కనైనా షాట్లను తన అభిమానులను మరోమారు అలరించాడు. లెజెండ్స్ లీగ్‌లో బ్యాట్ పట్టి ఆకట్టుకుంటున్నాడు.
Sachin Tendulkar: టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోమారు బ్యాట్ పట్టాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను కట్టిపడేశాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా వివిధ దేశాలకు చెందిన లెజెండ్స్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇండియా లెజెండ్స్ జట్టుకు సచిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. లెజెండ్స్ లీగ్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్, దక్షిణాఫ్రికా లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ముందుగా ఇండియా లెజెండ్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కొద్దిసేపు క్రీజులో ఉన్నప్పటికీ..తన బ్యాటింగ్‌తో అలరించాడు. మఖాయా ఎంటినీ బౌలింగ్‌లో లాఫ్టెడ్ షాట్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరోమారు పాత మాస్టర్ బ్లాస్టర్‌ను గుర్తు చేశాడు. ఈషాట్‌తో అభిమానులంతా ఫిదా అయ్యారు. ఈసయంలోనే స్టేడియమంతా అభిమానుల కేరింతలతో దద్దరిల్లింది. సచిన్ క్రీజులో ఉన్నంతసేపు అతడి పేరు మారుమోగింది.
ఈమ్యాచ్‌లో అతడు 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో ప్లేయర్ స్టువర్ట్ బిన్నీ విశ్వరూపం చూపించాడు. 24 బంతుల్లో 82 పరుగుల చేసి ఔరా అనిపించాడు. దీంతో ఇండియా లెజెండ్స్ నిర్ణీత ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ తడబడింది. 156 పరుగులకు సరిపెట్టుకుంది. దీంతో సచిన్ సేన 61 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది.
Also read:CM Kcr: జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారా..? కుమారస్వామితో మంతనాలు..!
Also read:Revanth Reddy: మోదీ ఇచ్చిన సుపారీతోనే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు: రేవంత్‌రెడ్డి..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి