CM Kcr: జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారా..? కుమారస్వామితో మంతనాలు..!

CM Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ మరింత స్పీడ్ పెంచారు. ప్రగతి భవన్‌ నుంచే రూట్‌ మ్యాప్‌ తయారు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Sep 11, 2022, 05:12 PM IST
  • జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ జోరు
  • సీనియర్ నేతలతో మంతనాలు
  • త్వరలో పార్టీ పేరు ప్రకటన
CM Kcr: జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారా..? కుమారస్వామితో మంతనాలు..!

CM Kcr: ప్రగతి భవన్‌కు చేరుకున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సాదరంగా ఇంటిలో తీసుకెళ్లారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధు సూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, రాజేందర్‌రెడ్డితోపాటు ఇతర నేతలు ఉన్నారు. ఆ తర్వాత లంచ్‌ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. 

అనంతరం సీఎం కేసీఆర్, మాజీ సీఎం కుమార స్వామి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. దేశంలో వర్తమాన రాజకీయాలపై మంతనాలు జరిపారు. ఇటీవల సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో జోరు పెంచారు. ఈక్రమంలోనే దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఢిల్లీ, బీహార్, బెంగళూరు నగరాలకు వెళ్లి సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులకు టీఆర్ఎస్ మద్దతు పలికింది. ఈఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులు ఓడిపోయినా..గట్టి పోటీ ఇచ్చామని ఇప్పటికే విపక్షాలు ప్రకటించాయి. బీజేపీ ముక్తా భారత్ తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా అమరులైన జవాన్లకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందిస్తున్నారు.

ఇటీవల బీహార్‌ వెళ్లిన ఆయన..జవాన్ల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదం ఘటనలో మృతి చెందిన బీహార్‌ కూలీల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం సీఎం నితీష్‌కుమార్ ఏర్పాటు చేసిన లంచ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరలో దేశంలో ప్రత్యామ్నాయ కూటమి రావాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు ప్రకటించారు. 

తాజాగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సీఎం కేసీఆర్ మంతనాలు జరిపారు. త్వరలో సీఎం కేసీఆర్..జాతీయ పార్టీని స్థాపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రీయ సమితి సంఘ్‌ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈఏడాది చివరిలోపు ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్‌ చక్రం తిప్పుతుందంటున్నారు.

Also read:Delhi Bus Scam: ఢిల్లీ సర్కార్‌కు మరో షాక్.. బస్సుల కొనుగోలు స్కామ్‌లో సీబీఐ దర్యాప్తుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్   

Also read:Krishnam Raju Death Live Updates: కృష్ణంరాజు కన్నుమూత.. రేపు అంత్యక్రియలు -లైవ్ అప్డేట్స్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News