టోక్యో ఒలింపిక్స్: అదితి అశోక్‌కు గోల్ఫ్‌లో జస్ట్ మిస్ అయిన బ్రాంజ్ మెడల్
Aditi Ashok misses bronze medal in Golf finals at Tokyo Olympics 2020: టోక్యో: అదితి అశోక్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో గోల్ఫ్ ఇండివిడ్యువల్ ఈవెంట్స్ ఫైనల్స్‌లో ఒక్క అడుగు దూరంలో కాంస్య పతకం చేజారిపోయింది. కర్ణాటకకు చెందిన అదితి అశోక్ టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో గోల్ఫ్ ఇండివిడ్యువల్ ఈవెంట్స్ ఫైనల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి కొద్దిపాటిలో పతకం కోల్పోయింది.
Aditi Ashok misses bronze medal in Golf finals at Tokyo Olympics 2020: టోక్యో: అదితి అశోక్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో గోల్ఫ్ ఇండివిడ్యువల్ ఈవెంట్స్ ఫైనల్స్‌లో ఒక్క అడుగు దూరంలో కాంస్య పతకం చేజారిపోయింది. కర్ణాటకకు చెందిన అదితి అశోక్ టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో గోల్ఫ్ ఇండివిడ్యువల్ ఈవెంట్స్ ఫైనల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి కొద్దిపాటిలో పతకం కోల్పోయింది. 200 ర్యాంకులో కొనసాగుతున్న అదితి అశోక్ తన బ్రిలియంట్ పర్ ఫార్మెన్స్ తో గోల్ఫ్ ప్రియులను ఆకట్టుకుంది.
అమెరికాకు చెందిన నెల్లి కోర్డా బంగారు పతకం (Nelly Korda wins Gold medal) కైవసం చేసుకోగా జపాన్‌కి చెందిన ఇనోమ్ మోన్, న్యూజిలాండ్‌కి చెందిన లిడియా కో రెండో స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరు గోల్ఫ్ క్రీడాకారిణులు వెండి, కాంస్య పతకం కోసం పోటీపడనున్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ గోల్ఫర్ అయిన అమెరికా గోల్ఫర్ నెల్లి కోర్డాతో ఒకానొక దశలో పోటాపోటీ ప్రదర్శన కనబర్చిన అదితి అశోక్ ఒక్క అడుగు దూరంలో బ్రాంజ్ మెడల్ (Bronze Medal) కోల్పోయినప్పటికీ.. దేశం గర్వించదగిన రీతిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి నాలుగో స్థానం వరకు చేరిన తొలి ఇండియన్ గోల్ఫర్‌గా చరిత్ర సృష్టించింది.
Also read : విశాఖలో త్వరలో అకాడమీ ప్రారంభించనున్న పీవీ సింధూ
అదితి అశోక్ అత్యుత్తమ ప్రదర్శనను ప్రశంసిస్తూ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ థాకూర్ ట్విటర్ ద్వారా అభినందించారు. టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics 2020) భారత మహిళా క్రీడాకారిణులు పతకాల వేటలో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారని అదితి అశోక్ (Aditi Ashok) మరోసారి నిరూపించింది.
Also read : ధోనీకి షాక్ ఇచ్చిన ట్విటర్.. బ్లూ టిక్ మార్క్ తొలగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook