Afghanistan Won by 8 runs Against Bangladesh: టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌ను ఓడించి తొలిసారి సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా ఇంటి ముఖం పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బంగ్లాను 8 పరుగులతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడం.. లక్ష్యాన్ని కాపాడుకునేందుకు అఫ్గాన్ పోరాడడం.. ఛేదనలో బంగ్లా పట్టు వీడకపోవడం.. మ్యాచ్‌ ఆద్యాంతం అభిమానులను అలరించింది. 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే సెమీస్ చేరే అవకాశాలు ఉండగా బంగ్లా చేజార్చుకుంది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఆసీస్ సెమీస్‌కు చేరి ఉండేది. బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్ (54 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. అవతలి ఎండ్‌ నుంచి బ్యాట్స్‌మెన్ సహకారం కరువైంది. థ్రిల్లింగ్ గేమ్‌లో అఫ్గాన్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో ఓడించి సెమీస్‌కు ఎంట్రీ ఇచ్చింది. భారత్-ఇంగ్లాండ్, సౌతాఫ్రికా-అఫ్గానిస్థాన్ జట్లు సెమీ ఫైనల్‌లో తలపడనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kerala Rename: కేరళంగా మారనున్న కేరళ, ఈసారైనా కేంద్రం పచ్చజెండా ఊపుతుందా


అఫ్గాన్ విధించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. ఆరంభం నుంచే తడపడింది. ఓపెనర్ లిట్టన్ దాస్ ఓ ఎండ్‌లో పాతుకుపోగా.. అవతలి ఎండ్‌లో వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు వెళ్లిపోయారు. లిట్టన్ దాస్ వన్ మ్యాన్‌ షోతో ఒక దశలో బంగ్లా మ్యాచ గెలిచేలా కనిపించింది. కానీ అఫ్గాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ చెరో నాలుగు వికెట్లు తీసి అఫ్గాన్‌ను గెలిపించారు. ఫరూఖీ, గులాబుద్దీన్ నయిబ్ తలో వికెట్ పడగొట్టారు.


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్‌ను బంగ్లా బౌలర్లు బాగానే కట్టడి చేశారు. ఓపెనర్లు గుర్బాజ్ (43), ఇబ్రహీం జాద్రాన్ (18) తొలి వికెట్‌కు 10.4 ఓవర్లలో 59 పరుగులు జోడించారు. అయితే నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. మిగిలిన బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడం కష్టంగా మారింది. చివర్లో రషీద్ ఖాన్ (10 బంతుల్లో 19 నాటౌట్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో అఫ్గాన్ స్కోరు 115 పరుగులకు చేరుకుంది. బంగ్లా బౌలర్లలో రిషద్ హుస్సేన్ 3 వికెట్లు తీయగా.. తస్కీన్ అహ్మద్, ముస్తాఫిజూర్ తలో వికెట్ తీశారు. నవీన్ ఉల్ హక్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.


Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి