Afg vs Pak match of T20 World Cup 2021: ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలుత భారత్, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచిన పాకిస్థాన్ తాజాగా దుబాయ్‌ వేదికగా ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టింది. ఆఫ్గనిస్తాన్‌పై పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలిచి ఘన విజయం సొంతం చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. మరొక ఓవర్‌ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (Babar Azam) 51 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 


ఇక ఫఖార్ జమాన్‌ కూడా (Fakhar Zaman) 25 బంతుల్లో 30 పరుగులు సాధించి ఆట వేగంగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో బ్యాటింగ్‌కి వచ్చిన అసిఫ్‌ అలీ (Asif Ali) మూడో మ్యాచ్‌లోనూ రెచ్చిపోయాడు. కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులు రాబట్టి పాకిస్థాన్‌ను విజయ తీరాలకు చేర్చాడు.