Ajaz Patel: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ స్పిన్నర్! మూడో బౌలర్‌గా రికార్డు!!
న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ అజాజ్ పటేల్ టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు జిమ్ లేకర్, మరియు అనిల్ కుంబ్లేలు మాత్రమే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టారు.
Ajaz Patel became the 3rd bowler in Test cricket history to take all 10 wickets in an innings: న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ (Ajaz Patel) టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ముంబైలోని వాంఖడే మైదానంలో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అజాజ్ పటేల్ పది వికెట్లు (10 wickets) తీశాడు. అంతకుముందు ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ (Jim Laker) మరియు టీమిండియా బౌలర్ అనిల్ కుంబ్లే (Anil Kumble)లు మాత్రమే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టారు. జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టింది అజాజ్ మాత్రమే. కివీస్ స్పిన్నర్ దెబ్బకు భారత్ 325 పరుగులకు ఆలౌట్ అయింది.
1956లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి ఈ రికార్డు అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. జిమ్ లేకర్ 53 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. 1999లో టీమిండియా స్పిన్నర్ అనిల్ కుంబ్లే దాయాది పాకిస్తాన్‌పై 10 వికెట్లు పడగొట్టాడు. జంబో 74 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. కుంబ్లే అనంతరం 22 ఏళ్లు తర్వాత న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 47 ఓవర్లు వేసిన ఆజాజ్.. 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు సాధించాడు.
Also Read: IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా షెడ్యూల్‌లో మార్పు.. టీ20 సిరీస్ వాయిదా! అసలు కారణం ఇదే?
కివీస్ తరఫున అజాజ్ పటేల్ (10/119) అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన బౌలర్‌గా కూడా నిలిచాడు. అంతకుముందు రిచర్డ్ హ్యాడ్లీ 1985లో ఆస్ట్రేలియాపై 52 పరుగులు ఇచ్చి 9 వికెట్లు తీశాడు. టీమిండియాపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (10/119) నమోదు చేసిన తొలి బౌలర్ అజాజే. 1971లో జాక్ నోరీగా (9/95) రెండో స్థానంలో ఉన్నాడు. భారత్‌లో విదేశీ స్పిన్నర్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి. నాథన్ లియోన్ (8/50), జాసన్ క్రేజా (8/215) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. మయాంక్ అగర్వాల్ (150; 311 బంతుల్లో 17x4, 4x6) భారీ సెంచరీ చేయగా, అక్షర్ పటేల్ (52; 128 బంతుల్లో 5x4, 1x6) హాఫ్ సెంచరీ బాదాడు. 221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. మరో 104 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే అజాజ్ పటేల్.. సాహా (27; 62 బంతుల్లో 3x4, 1x6), అశ్విన్ (0)లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన అక్షర్ అర్ధ శతకంతో రాణించాడు. మయాంక్‌తో కలిసి ఏడో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక రెండో సెషన్‌లో మయాంక్ 150 పరుగులు పూర్తి చేసిన మరుసటి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత భారత టెయిలెండర్లు పెద్దగా రాణించకపోవడంతో 325 పరుగులకు ఆలౌట్ అయింది.
Also Read: Deepika Padukone Prabhas Movie : ప్రభాస్ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్‌లో వాలిపోయిన దీపికా పదుకొణె
🔹 Jim Laker
🔹 Anil Kumble
🔹 Ajaz Patel
Remember the names! #WTC23 | #INDvNZ | https://t.co/EdvFj8yST5 pic.twitter.com/xDVImIifM6