ఒంటిచేత్తో.. వండర్ ఫుల్ క్యాచ్
క్రికెట్ లో క్యాచ్ లు పట్టడం మనం చాలా చూసి ఉంటాం.. కానీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ పట్టిన క్యాచ్ ..చాలా అరుదుగా చూస్తుంటాం. ప్రస్తుతం ఈ అంశమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే శనివారం బెంగళూరులో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఓవర్ స్వ్కేర్ లెగ్ మీదుగా ఓ భారీ షాట్ కొట్టాడు. సిక్స్ దిశగా వెళ్తున్న బాల్ ను బౌండరీలైన్ వద్ద ఉన్న ట్రెండ్ బౌల్డ్ దాన్ని అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. గాల్లో ఎగిరి ఒంటిచేత్తో అందుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. కిందపడ్డా కూడా బౌండరీ లైన్ కు ఏమాత్రం తగలకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ క్యాచ్ ఎలా పట్టాడో మీరు చూసి ఎంజాయ్ చేయండి...
<