Ambati Rayudu and Sheldon Jackson Involved In Heated Exchange: కెరీర్ చివరి దశలో ఉన్నా కూడా సీనియర్‌ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు 'తగ్గేదేలే' అంటున్నాడు. గొడవలతో అద్భుత కెరీర్‌ను నాశనం చేసుకున్న రాయుడు.. ఇప్పటికీ మారలేదు. దేశవాళీ, ఐపీఎల్ టోర్నీలలో చాలాసార్లు గొడవలు పడ్డ తెలుగు తేజం.. తాజాగా ఓ యువ ప్లేయర్‌తో వాగ్వాదంకు దిగాడు. సయ్యద్‌ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా షెల్డన్‌ జాక్సన్‌తో గొడవకు దిగాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టుకు అంబటి రాయుడు కెప్టెన్‌. బుధవారం (October 12) బరోడా, సౌరాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.  ఈ మ్యాచ్ సమయంలో సౌరాష్ట్ర బ్యాటర్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్‌తో రాయుడు గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో.. ఫీల్డ్ అంపైర్లు, సహచర ఆటగాళ్లు వారికి సర్దిచెప్పారు. బరోడా జట్టు మాజీ కెప్టెన్, టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్యా రాయుడిని పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పాడు. దాంతో గొడవ అక్కడితో ఆగిపోయింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన జాక్సన్‌.. బ్యాటింగ్‌కి సిద్ధమయ్యేందుకు టైమ్ తీసుకోవడంతో రాయుడికి కోపం వచ్చిందని సమాచారం తెలుస్తోంది. 


అంబటి రాయుడు మైదానాల్లో గొడవపడటం ఇదే మొదటిసారి కాదు. ఐపీఎల్‌లో హర్భజన్ సింగ్‌, జస్‌ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ తదితర ఆటగాళ్లతో గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. మైదానంలోనే కాదు వెలుపల కూడా రాయుడు గొడవ పడ్డాడు. ఉప్పల్ స్టేడియంలో ఓ వృద్దుడితో గొడవపడిన అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక కెరీర్ ప్రారంభంలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్ తనయుడు అర్జున్ యాదవ్‌తో గొడవపడిన రాయుడు.. ఏకంగా కెరీర్‌నే నాశనం చేసుకున్నాడు. తాజాగా షెల్డన్ జాక్సన్‌తో గొడవ పడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఇక మారవా అంటూ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. 


సౌరాష్ట్రతో జరిగిన మ్యాచులో బరోడా కెప్టెన్ అంబటి రాయుడు డకౌట్ అయ్యాడు. విష్ణు సోలంకి హాఫ్ సెంచరీ బాదడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన బరోడా టీమ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర టీమ్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అంబటి రాయుడు భారత్ తరఫున 53 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో 188 మ్యాచులు ఆడాడు. 


Also Read: God Father - Pawan Kalyan: ఆ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తే బాగుండేది: చిరంజీవి 


Also Read: Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ప్రేమికులకు కలిసొచ్చే కాలం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook