Angelo Mathews Timed Out: శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఏంజెలో మ్యాథ్యూస్ ఊహించని రీతిలో ఔట్ అయ్యాడు. క్రికెట్ చరిత్రలో తొలిసారి టైమ్ ఔట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు. వరల్డ్ కప్‌ 2023లో భాగంగా సోమవారం ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో శ్రీలంక తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో క్రీజ్‌లోకి రాని కారణంగా మ్యాథ్యూస్‌ను టైమ్ ఔట్ అయినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ టైమ్ ఔట్ అయిన తొలి ప్లేయర్‌గా ఓ చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుచుకున్నా ఈ సీనియర్ క్రికెటర్. క్రీజ్‌లోకి ఎంట్రీతోనే.. టైమ్ ఔట్ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట శ్రీలంక బ్యాటింగ్ ఆరంభించగా.. 25 ఓవర్లలో 42 బంతుల్లో 41 పరుగులు చేసిన సదీర సమరవిక్రమను షకీబ్ అవుట్ చేశాడు. దీంతో తరువాత బ్యాటింగ్‌కు మ్యాథ్యూస్ వచ్చేందుకు రెడీ అయ్యాడు. అయితే హెల్మెట్ పట్టీ సరిగా లేకపోవడంతో మరో హెల్మెట్ కోసం బయటే కాసేపు వెయిట్ చేశాడు. అనంతరం హెల్మెట్ తీసుకుని క్రీజ్‌లోకి రాగానే.. టైమ్ ఔట్ కోసం బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హాసన్‌తోపాటు ఫీల్డర్లు అప్పీల్ చేశారు. దీంతో మ్యాథ్యూస్‌ను టైమ్ ఔట్ అయినట్లు అంపైర్లు ప్రకటించారు. అంపైర్లు మరైస్ ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లతో మ్యాథ్యూస్ కాసేపు వాదించాడు. తనకు హెల్మెట్ పట్టీతో సమస్య ఉందని.. అందుకే ఆలస్యమైందన్నాడు. 


ఎంసీసీ నిబంధలన ప్రకారం.. ఒక బ్యాట్స్‌మెన్ ఔట్ అయిన తరువాత తరువాత వచ్చే బ్యాట్స్‌మెన్ రెండు నిమిషాల్లోపు క్రీజ్‌లో ఉండాలి. అయితే సమరవిక్రమ ఔట్ అయిన వెంటనే గ్రౌండ్‌లోకి వచ్చిన మ్యాథ్యూస్.. హెల్మెట్ కోసం అక్కడే ఆగిపోయాడు. మరో ప్లేయర్ హెల్మెట్ తీసుకువచ్చిన తరువాత క్రీజ్‌లోకి వచ్చాడు. అప్పటికే చాలా సమయం వృథా అయింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగానే అంపైర్లు ఔట్ అయినట్లు ప్రకటించారు. 


 




అంపైర్లు, బంగ్లా కెప్టెన్‌ షకీబుల్ హాసన్‌తో మ్యాథ్యూస్ మాట్లాడాడు. హెల్మెట్ కోసం ఆలస్యమైందని చెప్పే ప్రయత్నం చేయగా.. షకీబుల్ హాసన్ అప్పీల్‌ను వెనక్కి తీసుకోలేదు. దీంతో నిరాశగా మ్యాథ్యూస్‌ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ ఘటనతో మైదానంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయింది. ఇప్పటికే వరల్డ్ కప్‌ నుంచి రెండు జట్లు నిష్క్రమించగా.. టాప్-8లో నిలిచేందుకు పోరాడుతున్నాయి.


Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…


Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి