Vamika Kohli Photo: కోహ్లీ కూతురు వామిక ఎలా ఉందో చూశారా? సౌతాఫ్రికాతో వన్డేలో ఫొటోలు వైరల్!
Vamika Kohli Photo: ఎట్టకేలకు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె ఫొటో బయటకు వచ్చింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అనుష్క శర్మ.. తన కుమార్తెతో పాటు కెమెరాకు చిక్కింది. ఇప్పుడు వామికకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Vamika Kohli Photo: ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ - నటి అనుష్క శర్మల కుమార్తె వామిక గురించి ప్రస్తుతం ట్రెండ్ నడుస్తోంది. కోహ్లీ కుమార్తె వామిక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడమే అందుకు కారణం. ఎందుకంటే విరాట్ - అనుష్క దంపతులు.. మొదటి నుంచి వామిక ఫొటోలను బయటపడకుండా.. ఆమె మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు వామిక ముఖం పూర్తిగా మీడియా కంట పడింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఏం జరిగిందంటే?
సౌతాఫ్రికా పర్యటనకు కోహ్లీ సతీసమేతంగా వెళ్లాడు. ఇందులో భాగంగా మూడో వన్డేలో.. వామికా ఫేస్ కెమెరా కంటికి చిక్కింది. ఆ మ్యాచ్‌కు పాపతో కలిసి అనుష్క హాజరుకాగా అక్కడ వారిద్దరూ కలిసి ఉన్న దృశ్యం కెమెరాలో బందీ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
అయితే ఇందులో వామిక పూర్తి ముఖం కనిపించకున్నా.. ఆ చిన్నారి కళ్లు, ముక్కు సైడ్లుక్లో బాగానే కనిపిస్తుంది. అభిమానులు ఈ ఫొటోను ట్రెండింగ్ చేస్తూ విపరీతంగా లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోను మీరు చూసేయండి..
Also Read: IND vs SA: టీమిండియాను మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది.. అతడిని జట్టులోకి తీసుకోవాల్సిందే: మంజ్రేకర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook