Diego Maradona Died | ఫుట్ బాల్ అభిమానులకు చేదు వార్త. అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా మరణించనిట్టు సమాచారం. 60 సంవత్సరాల మారడోనాకు ఇంతకు ముందే గుండె పోటు రావడంతో మరణించినట్టు తెలుస్తోంది. గుండె పోటు రావడానికి ముందే నవంబర్ ఆరంభంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Cricketers Talent: మన క్రికెటర్లు క్రికెటర్స్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో తెలుసా?


మారడోనాకు ( Diego Maradona ) గుండెపోటు వచ్చే సమయంలో ఆయన ఇంట్లో ఉన్నారు. గత కొంత కాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రెండు వారాల క్రితమే కోలుకుని ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.



ALSO READ| Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు


డీగోను చాలా మంది El Pibe de Oro అంటే ది గోల్డెన్ బాయ్ పిలుస్తుంటారు. ఫుట్ బాల్ ( Football )లో డ్రిబ్లింగ్ స్కిల్స్, అద్భుతమైన వ్యక్తిత్వం గురించి మంచి గుర్తింపు సాధించాడు. 1986లో అర్జెంటీనాకు ప్రపంచ కప్పు సాధించి పెట్టాడు.
మారడోనాను చాలా మంది హ్యాండ్ ఆఫ్ గాడ్ (Hand Of God ) గా పిలుస్తుంటారు. 1986లో ఇంగ్లాండ్ ను ఓడించి తన దేశాన్ని గెలిపించి.. అర్జెంటీనా ఎవర్ గ్రీన్ హీరోగా మారాడు. ప్రపంచ సాకర్ రారాజుగా మాఅవతరించాడు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR