Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు

HBD Smriti Mandhana: స్మృతి మంథాన గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేక పరియం అవసరం లేదు. భారత మహిళా క్రికెట్ ( Indian Women Cricket ) విభాగంలో పెను సంచలనం ఆమె. ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది స్మృతి మంథాన.

Last Updated : Jul 18, 2020, 06:08 PM IST
Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు

HBD Smriti Mandhana: స్మృతి మంథాన గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేక పరియం అవసరం లేదు. భారత మహిళా క్రికెట్ ( Indian Women Cricket ) విభాగంలో పెను సంచలనం ఆమె. ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది స్మృతి మంథాన. క్రికెట్ ఫీల్డ్‌లో అగ్రెసీవ్‌గా బ్యాటింగ్ చేసే ఈ లెఫ్ట్ హ్యాండ్ ( Left Hand Batting ) బ్యాట్స్ వుమెన్ 18 జూలై 1996న ముంబైలో జన్మించింది. 2014లో ఇంగ్లాండ్‌లోని వార్మ్‌స్లీ పార్క్‌లో జరిగిన వన్డే మ్యాచులో తెరంగేట్రం చేసింది. స్మృతి మంథాన గురించి మీకు తెలియని 10 ఆసక్తికరమైన విషయాలివే. (  Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos  )

1.క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి
స్మృతి కుటుంబానికి క్రికెట్‌కు ( Cricket ) విడదీయరాని బంధం ఉంది. సాంగ్లిలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో మంథాన తండ్రి, సోదరుడు ఇద్దరూ క్రికెట్ ఆడారు. ఆమె సోదరుడు మహారాష్ట్ర అండర్ 16లో కూడా ఆడాడు.

2.చిన్నవయసులోనే
తొమ్మిది సంవత్సరాల వయసులోనే స్మృతి మంథాన మహారాష్ట్ర అండర్15 ( Maharastra Under-15 ) టీమ్‌కు సెలెక్ట్ అయింది. 11 ఏళ్లకు అండర్ 19కు ఆడి తన సత్తా చాటింది.

Harbhajan Singh: ఆమెను మనం ఆదర్శంగా తీసుకోవాలి

3. రికార్డు సెంచరీ

2013లో జరిగిన వన్డే మ్యాచులో స్మృతి మంథాన తొలి డబుల్ సెంచరీ ( First Women To Score Double Century ) సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.

4. చదువుకు బ్రేక్..

2014లో జరిగిన వరల్డ్ టీ20 కప్ కోసం స్మృతి మంథాన తన 12వ తరగతి (12Th Exams ) పరీక్షలకు దూరం అయింది. ఇంగ్లాండ్ టూర్ ఉండటంతో వేరే కాలేజీలో అడ్మిషన్ కూడా తీసుకోలేకపోయింది.

5. అక్కడ అలా.. ఇక్కడ ఇలా

క్రికెట్ ఫీల్డ్‌లో సీరియస్‌గా ఉండే స్మృతి మంథాన బయట మాత్రం చాలా సరదాగా ఉంటుంది. ఆమెకు అరిజిత్ సింగ్ ( Arijit Singh ) పాటలు అంటే ఇష్టమట.

6. హేడన్ ఇష్టం కానీ

మంథానాకు మాథ్యూ హేడెన్‌ ( Mathew Hayden ) లా బ్యాటింగ్ చేయడం అంటే ఇష్టమట. కానీ తన ఆటతీరు మాత్రం శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర (Kumara Sangakkara ) లా ఉంటుంది. ఎందుకంటే సంగక్కర బ్యాటింగ్ టైమింగ్ ఆమెకు నచ్చుతుందట. ఆమె బ్యాటింగ్ శైలిని మాథ్యూ హేడెన్ మెచ్చుకోవడం కొసమెరుపు.

HBD Priyanka Chopra: ప్రియాంకా చోప్రా గురించి 10 ఆసక్తికరమైన విషయాలు

7. బిగ్ బ్యాష్ లీగ్

2006లో బిగ్ బ్యాష్ లీగ్ ( Big Bash League ) కోసం హర్మాన్ ప్రీత్ కౌర్‌తో ( HarmaanPreetKaur) పాటు స్మృతి మంథాన కూడా సైన్ చేసింది. 

8. కుటుంబ సహకారం

స్మృతి మంథాన  కోసం ప్రత్యేక కార్యచరణను తయారు చేయడంలో ఆమె కుటుంబం మొత్తం సహకరిస్తుంది. ఆమె తండ్రి ఆమె కోసం ప్రత్యేక ప్రోగ్రామ్ సిద్ధం చేస్తాడు. ఇందులో ఆహారం ( Food ) , ప్రాక్టిస్ (Practice)  వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు.

9. ఐసీసీలో..

2016లో ఐసీసీ మహిళా క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళ క్రికెటర్ స్మృతి మంథాన #Smritimandhana.

 

10. పిన్నవయసులోనే..

2017లో మహిళ ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించి.. పిన్నవయసులోనే వరల్డ్ కప్‌లో ( World Cup Century ) సెంచురీ సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. వెస్టిండీస్‌తో ( West Indies Match ) జరిగిన మ్యాచులో 103 పరుగులు చేసింది.

Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery

Tollywood Updates: రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న కథానాయికలు

Viral Video: పక్షులకే చేతులు వస్తే.. ఈ వీడియో చూడండి

Follow us on twitter

Trending News