Ashes 2021: 68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. సందుచూసి మైఖేల్ వాన్‌ను ఏసుకున్న వసీమ్ జాఫర్!!
ఇంగ్లండ్ 68 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో టీమిండియా మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌కు చురకలు అంటించారు. టీమిండియాపై వాన్ గతంలో చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ.. ట్రోల్ చేశారు.
Wasim Jaffer trolls Michael Vaughan after England all out for 68 in Boxing Day Test: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes) 2021-22లో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే వరుసగా మూడు ఓడిన ఇంగ్లండ్ (England).. ట్రోఫీని ఆస్ట్రేలియా (Australia)కు అప్పగించింది. ముఖ్యంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టు (Boxing Day Test) రెండున్నర రోజుల్లోనే ముగిసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శనతో ప్రత్యర్థి ముందు ఇంగ్లీష్ జట్టు పూర్తిగా తలవంచింది. ఆసీస్ అరంగేట్ర బౌలర్ స్కాట్ బోలాండ్ ధాటి ఇంగ్లండ్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో పెవిలియన్‌కు క్యూ కట్టారు. మరి దారుణంగా 68 పరుగులకే ఆలౌట్ (England all out for 68) అయి ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు.
ఇంగ్లండ్ 68 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో టీమిండియా మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ (Wasim Jaffer) ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ (Michael Vaughan)కు చురకలు అంటించారు. టీమిండియాపై వాన్ గతంలో చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ.. ట్రోల్ చేశారు. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 30.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో వాన్ ట్విటర్ వేదికగా టీమిండియా బ్యాటింగ్ వైఫల్యాన్ని ఎగతాళి చేశారు. '92 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఈ రోజుల్లో కూడా 100 పరుగుల లోపు ఓ జట్టు ఆలౌటవ్వడం నమ్మలేకపోతున్నా' అని వాన్ ట్వీట్ చేశారు.
Also Read:NBK - Ravi Teja: బాలకృష్ణ పాటకు స్టెప్పులేసిన రవితేజ.. అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో అదుర్స్!!
ఇప్పుడు ఇంగ్లండ్ 68 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో మైఖేల్ వాన్‌కు వసీమ్ జాఫర్ అదిరే పంచ్ ఇచ్చారు. థన్ ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను ట్వీట్ చేసిన జాఫర్.. అందులో తన మొబైల్‌లో వాన్ చేసిన '100 పరుగుల్లోపు ఆలౌటవుతారా?' అని ట్వీట్‌ను హైలెట్ చేసి చూపించారు. అంతేకాదు వీడియో పూర్తయ్యాక కన్ను కూడా గీటారు. ఈ వీడియోకు 'ఇంగ్లండ్ 68 ఆలౌట్.. మైఖేల్ వాన్' అనే క్యాప్షన్ ఇచ్చి మైకేల్ వాన్‌కు ట్యాగ్ చేశారు. సిగ్గుపడుతున్న ఓ ఎమోజీని కూడా జతచేశారు. ట్వీట్ చూసిన వాన్.. 'వెరీ గుడ్ వసీమ్ 'అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'సూపర్ రిప్లై వసీమ్ జాఫర్' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'సందుచూసి.. మైఖేల్ వాన్‌ను ఏసుకున్నావ్ పో' అని ఇంకొకరు ట్వీటారు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ (Michael Vaughan) ఎప్పుడూ కూడా టీమిండియాకు వ్యతిరేకంగా ఉంటారు. వీలుచిక్కినప్పుడల్లా తన అక్కసు వెళ్లగక్కుతుంటారు. చిన్న విషయాన్ని కూడా హైలెట్ చేసి కామెంట్స్, ట్వీట్స్ చేస్తుంటారు. పిచ్, మ్యాచ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనపై మాట్లాడుతూ నిత్యం వార్తల్లో ఉంటారు. అయితే అదునుచూసుకొని వసీమ్ జాఫర్ (Wasim Jaffer) కూడా వాన్‌పై సెటైర్లు పేల్చుతుంటారు. వాన్ ఇంగ్లండ్ తరఫున 82 టెస్టులు, 86 వన్డేలు, 2 టీ20లు ఆడారు. రిటైర్మెంట్ అనంతరం వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు.
Also Read: Viral Video: శాంతాక్లాజ్ టోపి ధరించి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్న పాము, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook