Viral Video: శాంతాక్లాజ్ టోపి ధరించి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్న పాము, వీడియో వైరల్

Viral Video: పాము క్రిస్మస్ పండుగ చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఈ వీడియో చూసేయండి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 02:56 PM IST
Viral Video: శాంతాక్లాజ్ టోపి ధరించి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్న పాము, వీడియో వైరల్

Snake Viral Video: మనం ఇంతకముందు ఎన్నడూ చూడని వీడియోలు నెట్టింట్లో వైరల్ (Viral Video) అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే..మరికొన్ని దృశ్యాలు ఆశ్చర్యపరుస్తాయి. సాధారణంగా మనం పామును జంకుతాం. అది దగ్గరకు వస్తే భయంతో పరుగులు తీస్తాం. అయితే పాము శాంతాక్లాజ్ టోపి ధరించి హల్ చల్ చేసిన వీడియో మీరెప్పుడైనా చూశారా?.ఇది మీరు నమ్మడం లేదు కదా.. ఇది నిజం. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) ట్రెండ్ అవుతోంది. అందులో ఒక పాము చాలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ..ఆడుకుంటుంది. ఈ వీడియోకు (Snake Viral Video) నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.   

ఈ వీడియోలో పాము భిన్నమైన రూపంలో కనిపిస్తోంది. కొన్ని సెకన్ల ఈ క్లిప్‌లో.. పాము శాంటాక్లాజ్ టోపీ ధరించి సరదాగా పాకుతూ కనిపించింది. అదే సమయంలో ఓ వ్యక్తి పామును (Snake) వీడియో తీస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాము కూడా సరదాగా కెమెరాకు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తోంది. పామును చూస్తే.. నవ్వుతూ ఈ క్షణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ఫన్నీ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్స్ లైకులు, కామెంట్ల ద్వారా ప్రేమను కురిపిస్తున్నారు. ఒకరు ఈ పాము చాలా అందంగా ఉందంటే...మరోవ్యక్తి ఇది చాలా ప్రమాదకరమైన పాము అని కామెంట్ చేశాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ViralHog (@viralhog)

Also Read: Shocking Viral Video: మిరాకిల్.. పిడుగుపడ్డా అతను బతికి బయటపడ్డాడు... వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News