England Spinner Jack Leach gives autograph on Fan's bald head: ప్రపంచ క్రీడల్లో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజే వేరు. టెస్ట్, వన్డే, టీ20... మ్యాచ్ ఏదైనా అభిమానులు మైదానాలకు బారులు కడతారు. తమ అభిమాన ఆటగాడి ఆటను దగ్గరనుంచి చూసి సంతోషపడతారు. అవకాశం దొరికితే తమ అభిమాన క్రికెటర్‌తో సెల్ఫీ దిగడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం లాంటివి చేస్తారు. ఫాన్స్ అందరూ తమ వెంట తెచ్చుకున్న బుక్, బాల్, బ్యాట్, క్యాప్, జెర్సీ లాంటి వస్తువులపై ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం సాధారణమే. అయితే ఓ అభిమాని మాత్రం బట్ట తల (Bald Head)పై ఆటోగ్రాఫ్ (Autograph) తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన యాషెస్‌ 2022 (Ashes 2022)లో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ (AUS vs ENG) మధ్య బుధవారం (డిసెంబర్ 5) నాలుగో టెస్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ఆట వర్షం వల్ల పలుమార్లు నిలిచిపోయింది. మొదటి రోజు కేవలం 46 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. వర్షం అప్పుడప్పుడూ పలకరిస్తున్నా.. మ్యాచ్ చూడడానికి వచ్చిన ఫాన్స్ (Fans) మాత్రం మైదానం వీడలేదు. మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్‌ (Jack Leach)ను ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరారు. ఓ అభిమాని బట్ట తలపై సంతకం (Autograph On Bald Head) చేయమని కోరగా.. జాక్ లీచ్‌ అతడి కోరికను నెరవేర్చాడు. ఇది చూసిన అక్కడి అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు.


Also Read: IND vs SA: హార్దిక్‌ పాండ్యా నుంచి టీమిండియా ఆశించిన దాన్ని.. శార్దూల్‌ ఠాకూర్‌ నెరవేరుస్తున్నాడు: ఆకాశ్‌ చోప్రా


అభిమాని బట్ట తలపై ఇంగ్లీష్ స్పిన్నర్ జాక్ లీచ్ సంతకం చేస్తున్న దృశ్యాలను స్టేడియంలో ఉన్న లైవ్ స్క్రీన్‌పైన కూడా చూపించారు. దాంతో మైదానం మొత్తం నవ్వులు పూశాయి. జాక్ లీచ్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 'ఓరి నీ అభిమానం పాడుగాను' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అక్కడ ఆటోగ్రాఫ్‌ తీసుకుంటే ఎలా ఉంటది' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.  'అరె ఏంట్రా ఇది.. గుండుపై ఆటోగ్రాఫ్‌',  'ఏంటో నీ పిచ్చి అభిమానం' అంటూ ఫన్నీ మీమ్స్‌, కామెంట్స్ షేర్‌ చేస్తున్నారు. 




ఈ మ్యాచులో 416/8 వద్ద ఆస్ట్రేలియా (Australia) తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ స్టార్ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజా సెంచరీలతో సత్తాచాటాడు. 260 బంతులు ఎదుర్కొని 13 ఫోర్ల సాయంతో 137 పరుగులు సాధించాడు. మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ 67 పరుగులతో ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా మిగతా బ్యాటర్లు తలో చేయి వేశారు. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 5 వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌ (England) వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ఆసీస్‌ ఇప్పటికే 3-0 తేడాతో యాషెస్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 


Also Read: Disha Patani In Pink Bikini: హద్దులు దాటిన దిశా పటాని ఎద అందాలు.. పింక్ బికినీలో పిచ్చెక్కిస్తోంది!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook