భారత్, పాకిస్తాన్ సిరీస్‌ల తరువాత ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న సిరీస్ యాషెస్ సిరీస్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య దశాబ్దాల నుంచి ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది యాషెస్ సిరీస్‌కు షెడ్యూల్ (Ashes Series Schedule) ప్రకటించారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్లు ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) మరియు క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) పురుషుల మరియు మహిళల యాషెస్ సిరీస్ షెడ్యూల్ ప్రకటించాయి. బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా పురుషుల యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 8 నుంచి 12 తేదీల మధ్య ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ షెడ్యూల్ చేశారు. డిసెంబర్ 16 నుంచి 20 తేదీల మద్య అడిలైడ్‌లోని ఓవల్ మైదానంలో రెండో టెస్టు నిర్వహించనున్నారు. బాక్సింగ్ డే టెస్టు మరియు న్యూ ఇయర్ టెస్టు ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 26-30 తేదీల మధ్య షెడ్యూల్ చేశారు. 


Also Read: Virat Kohli వికెట్‌ తీయడంపై న్యూజిలాండ్ పేసర్ Tim Southeeని ప్రశ్నించిన అభిమాని



సిడ్నీలో వచ్చే ఏడాది జనవరి 5 -9 తేదీలలో నాలుగో టెస్టు, చివరిదైన 5వ టెస్టుకు పెర్త్ లోని ఆప్టస్ స్టేడియం వేదికగా మారనుంది. జనవరి 14-18 తేదీలలో షెడ్యూల్ చేసినట్లు ఈసీబీ ప్రకటించింది. ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో చివరి టెస్టును సిడ్నీలో నిర్వహించకపోవడం 26 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. మహిళ యాషెస్ సిరీస్ మనుకా ఓవల్, కాన్‌బెర్రా వేదికగా ప్రారంభం కానుంది. 


Also Read: IPL 2021: ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న ఐపీఎల్ 2021 Australian Players, కోచ్‌లు


టీ20 సిరీస్ నార్త్ సిడ్నీ ఓవల్ మైదానంలో ఫిబ్రవరి 4 మరియు ఫిబ్రవరి 6 తేదీలలో నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. అడిలైడ్ ఓవల్‌లో ఫిబ్రవరి 10న మరో టీ20 మ్యాచ్ జరగనుంది. మహిళల యాషెస్ సిరీస్ ముగియగానే ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌కు బయలుదేరనుంది. అక్కడ ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో పాల్గొననున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook