Virat Kohli వికెట్‌ తీయడంపై న్యూజిలాండ్ పేసర్ Tim Southeeని ప్రశ్నించిన అభిమాని

WTC Final In Southampton | ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌ వేదికగా జూన్ 18వ తేదీ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. ఇతర దేశాల ఆటగాళ్లు సైతం తొలి టెస్టు ఛాంపియన్‌షిప్ ఎవరు కైవసం చేసుకుంటారో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 18, 2021, 01:18 PM IST
  • న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్
  • జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం
  • ఇంగ్లాండ్‌కు పయనం అవుతున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు
Virat Kohli వికెట్‌ తీయడంపై న్యూజిలాండ్ పేసర్ Tim Southeeని ప్రశ్నించిన అభిమాని

క్రికెట్‌లో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. భారత జట్టుతో మ్యాచ్ అంటే గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వికెట్ కోసం ఎంతగా తపించేవారో, బౌలర్లు ప్రస్తుతం విరాట్ కోహ్లీ వికెట్ తీసేందుకు ఎంతగానో శ్రమిస్తుంటారు. యూకేలోని సౌతాంప్టన్ నగరం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వేదికగా మారింది. వన్డే వరల్డ్ కప్ 2019 సెమిఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

న్యూజిలాండ్ ఆటగాళ్లను ఎయిర్‌పోర్టులో కలుసుకున్న ఓ అభిమాని తొలుత రాస్ టేలర్‌ను పలకరించాడు. సెల్ఫీ సైతం తీసుకున్నాడు. ఆ వెంటనే కివీస్ పేసర్ టిమ్ సౌథీని ఆ ఫ్యాన్ ఓ ప్రశ్న అడిగాడు. డబ్లూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) వికెట్ తీసుకుంటే ఎలా ఫీలవుతారని పేసర్ సౌతీని అడిగాడు. కోహ్లీ వికెట్ తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని సౌథీ బదులిచ్చాడు. ఇంగ్లాండ్‌కు వెళుతున్నారా అని అడగగా రాస్ టేలర్ అవునని చెప్పాడు. అనంతరం పేసర్ టిమ్ సౌథీని అడిగిన ప్రశ్న మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో తమ ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా ట్రెండింగ్ అవుతోంది. 

Also Read: IPL 2021: ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న ఐపీఎల్ 2021 Australian Players, కోచ్‌లు

టిమ్ సౌథీ మూడు టెస్టుల్లో రెండు పర్యాయాలు విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టాడు. తొలిసారి 2012లో బెంగళూరు టెస్టులో శతకం చేసిన అనంతరం సౌథీ బౌలింగ్‌లో కోహ్లీ ఔటయ్యాడు. ఆక్లాండ్‌లో జరిగిన టెస్టులో కేవలం 4 పరుగుల వద్ద సౌథీని వికెట్ సమర్పించుకున్నాడు. వన్డేల్లో అయితే టీమిండియా(Team India) రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై కివీస్ పేసర్‌కు మంచి రికార్డు ఉంది. వన్డేల్లో 6 పర్యాయాలు, టీ20లలో రెండు పర్యాయాలు సౌథీ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీ వికెట్ చేజార్చుకున్నాడు. 

Also Read: Pakistan పేసర్ Shoaib Akhtar ఆ టీమిండియా బ్యాట్స్‌మన్‌కు వార్నింగ్ ఇచ్చాడట

ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌ వేదికగా జూన్ 18వ తేదీ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. ఇతర దేశాల ఆటగాళ్లు సైతం తొలి టెస్టు ఛాంపియన్‌షిప్ ఎవరు కైవసం చేసుకుంటారో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News