Ashton Agar Fielding: బౌండరీ వద్ద అష్టన్ అగర్ కళ్లు చెదిరే విన్యాసం.. ఇలాంటి ఫీల్డింగ్ ఎప్పుడూ చూసుండరు!
Ashton Agar stunning fielding and save six in Australia vs England Match. ఇప్పటికే ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం చూసాం. తాజాగా అంతకు మించిన ఫీల్డింగ్ విన్యాసం నమోదైంది.
Ashton Agar crazy fielding at boundry line stuns everyone in Australia vs England Match: క్రికెట్ ఆటలో నిత్యం ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుత క్యాచ్‌లు పడుతుంటారు. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని.. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తారు. మైదానంలో పరుగెత్తుతూ క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకుంటారు. ఇలాంటివి ఇప్పటికే ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం చూసాం. తాజాగా అంతకు మించిన ఫీల్డింగ్ విన్యాసం నమోదైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్టన్ అగర్ కళ్లు చెదిరే ఫీల్డింగ్ చేశాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 45వ ఓవర్‌ను ఆస్ట్రేలియా పేసర్ ఫ్యాట్ కమిన్స్ వేశాడు. కమిన్స్ వేసిన చివరి బంతిని ఇంగ్లీష్ బ్యాటర్ డేవిడ్ మలాన్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి చాలా ఎత్తుకు వెళ్లడంతో కచ్చితంగా సిక్స్ అని అందరూ అనుకున్నారు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న ఆసీస్ స్పిన్నర్ ఆస్టన్ అగర్.. 'సూపర్ మ్యాన్'లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. అప్పటికే బౌండరీ లైన్ దాటేయడంతో.. బంతిని వెంటనే అవతలకు విసిరేశాడు. ఆపై అగర్ కిందపడ్డాడు.
ఆస్టన్ అగర్ విసిరిన బంతిని మరో ఆస్ట్రేలియా ఫీల్డర్ అందుకుని క్రీజు వైపు విసిరాడు. దాంతో ఆరు పరుగులు రావాల్సిన చోట ఇంగ్లండ్‌కు ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. క్యాచ్ మిస్ అయినప్పటికీ.. అగర్ ఫీల్డింగ్ విన్యాసం మాత్రం సంచలనమే అని చెప్పాలి. ఆస్టన్ ఫీల్డింగ్ విన్యాసంకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'వాట్ ఏ ఫీల్డింగ్', 'క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఫీల్డింగ్', 'టేక్ ఏ బో' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ప్రపంచంలోనే అత్యంత పొడవైన కింగ్ కోబ్రా.. చూస్తేనే వెన్నులో వణుకుపుడుతుంది! ఈజీగా పట్టేసిన వ్యక్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి