ప్రారంభమైన పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ మ్యాచ్ : రెండు జట్లను వేధిస్తున్న సమస్య అదే
షేక్ జాయేద్ స్డేడియంలో పాక్ vs బంగ్లాదేశ్
ఆసియా కప్ 2018 పోటీల్లో భాగంగా సూపర్ 4లోని 6వ మ్యాచ్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్డేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టేన్ మష్రాఫె మొర్తాజ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌లో భారత్‌తో పోటీ పడనుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు రెండూ ఎలాగోలా సూపర్ 4లో 6వ మ్యాచ్ వరకు చేరుకున్నప్పటికీ.. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లను పరిశీలిస్తే, ఈ రెండు జట్లను బౌలింగ్ సమస్య వేధిస్తోంది. ఎల్లుండి ఫైనల్స్‌లో భారత్‌తో తలపడాలంటే ముందుగా ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా బౌలింగ్‌లో రానించాల్సిన అవసరం ఈ రెండు జట్లకు ఎంతైనా ఉందంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.
బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లు:
లితన్ దాస్, నజ్ముల్ హూస్సేన్ శాంటో, మొహమ్మద్ మిథున్, ముష్‌ఫిఖుర్ రహీం(వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, ఇమ్రుల్ కేస్, మహ్మదుల్లా, ముష్రఫే మొర్తాజ(కెప్టేన్), మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, నజ్ముల్ ఇస్లాం, రుబెల్ హుస్సేన్, అబు హైదర్ రోని, సౌమ్య సర్కార్, మొమినుల్ హఖీ, మొసద్దెక్ హుస్సేన్, అరిఫుల్ హఖి
పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు:
ఇమామ్ ఉల్ హఖ్, ఫఖర్ జమన్, బాబర్ ఆజం, సర్ఫరాజ్ అహ్మెద్ (వికెట్ కీపర్), షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, హసన్ అలి, మొహమ్మద్ ఆమిర్, షాహీన్ అఫ్రిదీ, హరీస్ సోహైల్, ఫహీం అష్రాఫ్, జునైద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, షాన్ మసూద్.