Asia Cup 2022: ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ 4 లో టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగింది. చివరికి శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూపర్ 4లో వరుస రెండో ఓటమితో ఇండియా ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ 4లో టీమ్ ఇండియా మరో ఓటమి చవిచూసింది. సూపర్ 4 తొలి మ్యాచ్ పాకిస్తాన్ చేతిలో పరాజయం పొందిన టీమ్ ఇండియా ఇప్పుడు శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆసియా కప్ సూపర్ 4లో వరుసగా రెండవ మ్యాచ్ ఓడిపోవడంతో..టీమ్ ఇండియా ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి..


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో రాణించకపోగా..కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 41 బంతుల్లో 72 పరుగులు సాధించాడు. అటు సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 34 పరుగులు చేశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా, హుడా కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. టీమ్ ఇండియా బౌలర్లలో చహల్ 3 వికెట్లు, అశ్విన్ 1 వికెట్ తీశారు. 


ఆ తరువాత 174 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓ దశలో 120 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన ఆ తరువాత నిలదొక్కుకుంది. నిర్ణీత 174 పరుగుల లక్ష్యం వరకూ మరో వికెట్ నష్టపోకుండా భానుకా రాజపక్స, దాసున్ షనకలు నిలబడిపోయారు. చివరి బంతి వరకూ మ్యాచ్ ఉత్కంఠ రేపినా..శ్రీలంక నిదానంగా ఆడుతూ..బంతికో సింగిల్ తీస్తూ..మరో బంతి మిగిలుండగా విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో టీమ్ ఇండియాపై విజయం సాధించింది. రాజపక్స 16 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగుల చేసి నాటౌట్‌గా నిలవగా.దాసున్ షనక 17 బంతుల్లో 4 బౌండరీలు, 1 సిక్సర్ సహాయంతో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ ప్రారంభంలో కుసల్ మెండిస్ 57 పరుగులు, నిస్సాంక 52 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు.


Also read: T20 WC 2022: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌నకు సౌతాఫ్రికా జట్టు ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook