రాహుల్ ద్రవిడ్ హనీమూన్ కాలం ముగిసింది.. భారత మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Asia Cup 2022, Saba Karim on Rahul Dravid`s Coaching for India. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ హనీమూన్ కాలం ముగిసిందని భారత మాజీ సెలెక్టర్ సబా కరీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Saba Karim Feels Team India Head Coach Rahul Dravids Honeymoon Phase Is Over: టైటిల్ ఫేవరెట్‌గా ఆసియా కప్ 2022లోకి అడుగుపెట్టిన భారత్.. పేలవ ప్రదర్శనతో సూపర్ 4 నుంచి ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో వరుస విజయాలు అందుకున్న భారత్.. సూపర్ 4 దశలో పాకిస్తాన్, శ్రీలంకపై ఓడి మూల్యం చెల్లించుకుంది. జట్టు ఎంపిక నుంచి తుది జట్టు కూర్పు వరకు మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలు ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. భారత్ పరాజయాలపై మాజీలు తమ తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. తాజాగా భారత మాజీ సెలెక్టర్ సబా కరీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్పోర్ట్స్ 18 నిర్వహించే 'స్పోర్ట్స్ ఓవర్ ది టాప్'లో సబా కరీమ్ మాట్లాడుతూ... కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ హనీమూన్ కాలం ముగిసిందని, ఇక జట్టుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. '2021లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ ద్రవిడ్‌పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కోచ్‌గా హనీమూన్ కాలం ముగిసిందని అతడికి కూడా తెలుసు. ద్రవిడ్ తన ఉత్తమ ప్రదర్శనను అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అయితే జట్టులో మాత్రం ఫలితం కనిపించడం లేదు. ఇది అతడికి కఠిన సమయం అనే చెప్పాలి' అని సబా కరీమ్ అన్నారు.
'రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో విజయం సాధించడం ఆనందమే. అయితే ఇప్పుడు ద్రవిడ్ ముందు అసలైన సవాళ్లు ఉన్నాయి. త్వరలో టీ20 ప్రపంచకప్ 2022 రాబోతోంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కూడా ఉంది. ఈ రెండు ఐసీసీ ఈవెంట్లను భారత్ గెలిస్తే.. కోచ్‌గా ద్రవిడ్ సక్సెస్ అయినట్టే. అప్పుడు తను అందించిన సేవలతో ద్రవిడ్ సంతృప్తి చెందుతాడు. ఇక SENA దేశాలలో టెస్టు సిరీస్‌లను గెలిస్తే కోచ్‌గా అతడు బెస్ట్ అని చెప్పొచ్చు' అని సబా కరీమ్ చెప్పుకొచ్చారు.
Also Read: Jadeja BCCI: కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా.. రవీంద్ర జడేజా గాయంపై బీసీసీఐ ఫైర్!
Also Read: Weight Loss Tips: బరువు తగ్గడంలో అరటి పండ్లు సహాయపడుతాయా?.. ఈ విషయం తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి