Jadeja BCCI: కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా.. రవీంద్ర జడేజా గాయంపై బీసీసీఐ ఫైర్!

BCCI Unhappy with Ravindra Jadeja Injury. రవీంద్ర జడేజా గాయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గుర్రుగా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 10, 2022, 11:21 AM IST
  • కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా
  • రవీంద్ర జడేజా గాయంపై బీసీసీఐ ఫైర్
  • టీ20 ప్రపంచకప్‌ ఆడడం సందేహం
Jadeja BCCI: కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా.. రవీంద్ర జడేజా గాయంపై బీసీసీఐ ఫైర్!

BCCI not happy with Ravindra Jadejas Knee Injury: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆసియా కప్‌ 2022 మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే. దుబాయ్‌ సముద్ర తీరంలో ‘స్కై బోర్డు’పై విన్యాసాలు చేయబోయిన జడేజా మోకాలి గాయం కావడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. జడేజా గాయం జట్టు కాంబినేషన్‌ను పూర్తిగా మార్చేసింది. అంతేకాదు వరుస ఓటములతో భారత్ ఆసియా కప్‌ నుంచి కూడా నిష్క్రమించింది. ఇక త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌ 2022లో జడ్డు ఆడడం సందేహంగా మారింది.

రవీంద్ర జడేజా గాయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గుర్రుగా ఉంది. ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ లాంటి మేజర్ టోర్నీలు ఉన్నపుడు కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా అంటూ ఓ బీసీసీఐ అధికారి జడ్డుపై ఫైర్ అయ్యారు. 'రవీంద్ర జడేజా గాయంతో మేము ఏమాత్రం సంతోషంగా లేము. అతను సాహసోపేత పనులు చేసేముందు టీ20 ప్రపంచకప్‌ 2022ను దృష్టిలో ఉంచుకోవాలి కదా. జడేజా  చర్యతో మేము అసహనానికి లోనయ్యాం' అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. 

రవీంద్ర జడేజా ఆసియా కప్‌ 2022లో పాకిస్తాన్, హాంకాంగ్‌లతో మ్యాచుల అనంతరం సముద్ర తీరంలో ‘స్కై బోర్డు’పై విన్యాసాలు చేసి గాయపడ్డాడు. రెండు గేమ్‌లు ఆడిన తర్వాత ఆసియా కప్ 2022 నుంచి ఔట్ అయ్యాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జడ్డు 35 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. రెండు ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హాంకాంగ్‌తో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయకున్నా.. బంతితో (1/15) రాణించాడు. అంతేకాదు మెరుపు ఫీల్డింగ్ చేశాడు.

మంగళవారం రవీంద్ర జడేజా తన కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తన శస్త్రచికిత్స విజయవంతమైందని ఇన్‌స్టాగ్రామ్‌ద్వారా వెల్లడించాడు. 'శస్త్రచికిత్స విజయవంతమైంది. కృతజ్ఞతలు చెప్పడానికి చాలా మంది ఉన్నారు. బీసీసీఐ, నా సహచరులు, సహాయక సిబ్బంది, ఫిజియోలు, వైద్యులు మరియు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను నా పునరావాసాన్ని త్వరలో ప్రారంభించి.. వీలైనంత త్వరగా జట్టులోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను' అని జడేజా పేర్కొన్నాడు. 

Also Read: Weight Loss Tips: బరువు తగ్గడంలో అరటి పండ్లు సహాయపడుతాయా?.. ఈ విషయం తెలుసుకోండి!

Also Read: టీషర్టు లోపల చెయ్యి పెట్టుకోండి.. దిగజారి పోతున్న గీతూ ప్రవర్తన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News