Sri Lanka vs Afghanistan Head-to-Head Records and Playing 11: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆసియా కప్ 2022 నేడు ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కప్ టోర్నమెంట్‌లో శ్రీలంకకు మంచి రికార్డ్ ఉంది. ఇప్పటివరకు లంక ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నమెంట్‌లో ఆడడం ఇది మూడోసారి. ఆసియా కప్ టోర్నమెంట్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఒక్కసారే ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచులో లంక గెలుపొందింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జట్లు ఒకసారి కూడా తలపడలేదు. అంతేకాదు యూఏఈలోనే ఆడలేదు. 


శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌లో సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇటీవల లంక అద్భుతంగా పుంజుకొంది. స్టార్ ఆటగాళ్ల నిష్క్రమణ అనంతరం కొద్దికాలం తడబడిన లంకేయులు ప్రస్తుతం బాగా ఆడుతున్నారు. బలమైన ఆస్ట్రేలియాపై వరుస విజయాలను సాధించింది. అదే ఊపుతో ఆసియా కప్‌ 2022లో ఎంట్రీ ఇవ్వబోతోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా పటిష్టంగానే ఉంది. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 


తుది జట్లు (అంచనా)
శ్రీలంక: పాథుమ్ నిశ్శంక (వికెట్ కీపర్), ధనుష్క గుణతిలక, భానుక రాజపక్స, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, డాసన్ శనక (కేప్టెన్), వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, చమిక కరుణరత్నె, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండెర్సే. 
ఆఫ్ఘనిస్తాన్‌: నజీబుల్లా జడ్రాన్, హజ్రతుల్లా జరాయ్, ఇబ్రహీం జడ్రాన్, ఉస్మాన్ ఘని, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ (కేప్టెన్), రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, నవీనుల్ హక్, నూర్ అహ్మద్, కరీం జనత్. 


Also Read: Chiranjeevi: రెండు, మూడు రోజుల్లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చిరంజీవి... కారణమిదే..  


Also Read: September 2022 Movie Releases: ఏకంగా 17 సినిమాలు రిలీజ్.. లిస్టు ఇదే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook