Asia Cup 2022: ప్రస్తుతం భారత జట్టు మంచి ఫామ్‌లో ఉందన్నాడు భారత జట్టు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్. టీమిండియా బ్యాటింగ్ విభాగం మంచి ఫామ్‌లో ఉందని చెప్పాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్ల సేవలను మరింత ఉపయోగించుకోవలన్నాడు. సరైన స్థానాల్లో వారిని ఆడించాలని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ బదులు..సూపర్ ఫామ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్ సూర్యకుమార్‌ను ఆడించాలన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్వరలో టీ20 వరల్డ్ కప్ మొదలు కానుందని..ఇందులో భారత్ మెరుగ్గా రాణించాలంటే కీలక ఆటగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నాడు భారత జట్టు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్. పొట్టి ప్రపంచకప్‌లో స్టార్ బౌలర్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలకమవుతారని తెలిపాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్, విండీస్ టీ20 సిరీస్‌ల్లో అద్భుతంగా ఆడాడు. ఓ క్రీడా ఛానెల్‌లో మాట్లాడిన గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.


ఏ జట్టుకైనా బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానం కీలకమన్నాడు. టీమిండియా తరపున ఆ స్థానంలో కోహ్లీ ఆడుతున్నాడని..అతడు బదులు సూర్యకుమార్‌ను ఆడిస్తే బాగుటుందన్నాడు. గతకొంతకాలంగా అతడి బ్యాటింగ్ శైలిలో వైవిద్యం కనిపిస్తోంది. ఇంగ్లండ్ వంటి జట్లపై అద్భుతంగా రాణించాడని గుర్తు చేశాడు గౌతమ్ గంభీర్. అందుకే సూర్యకుమార్‌ యాదవ్‌కు ప్రామోషన్ ఇవ్వాలన్నాడు. సీనియర్ బ్యాటర్ కోహ్లీ ఏ స్థానంలోనైనా ఆడగలగడని స్పష్టం చేశాడు. 


టీ20 వరల్డ్ కప్ వరకు మూడో స్థానంలో పంపాలన్నాడు గంభీర్. మెగా టోర్నీలో బుమ్రా, హార్దిక్ పాండ్యా కీలకమన్నాడు. వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలరన్నాడు. హార్దిక్ పాండ్యా..బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించగలడని..140 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధిస్తాడని గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఓ ఆల్‌రౌండర్ నుంచైనా ఇంతకంటే ఏం ఆశిస్తామన్నాడు. అందుకే వరల్డ్ కప్‌ వరకు వీరిద్దరిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నాడు. 


ప్రపంచకప్‌లో టీమిండియా రాణించాలంటే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా కీలకమని స్పష్టం చేశాడు గంభీర్. ప్రస్తుతం ఆసియా కప్‌లో భారత్ ఆడుతోంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో సూపర్-4లోకి ప్రవేశించింది. ఆసియా కప్ తర్వాత ఆసీస్‌తో పరిమిత మ్యాచ్‌ల సిరీస్‌ జరగనుంది. అనంతరం టీ20 వరల్డ్ కప్ జరగనుంది.


[[{"fid":"243648","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read:విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ‌.. టాప్‌లో ఎంఎస్ ధోనీ!


Also read:K.Laxman: ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతోందా..? బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్‌ ఏమన్నారంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి