Asia Cup 2022: ఆసియా కప్ క్రికెట్ త్వరలో ప్రారంభం కానుంది. రెండు దాయాది దేశాలు మరోసారి తలపడనున్నాయి. ఈ క్రమంలో టీమ్ ఇండియాకు పెద్ద సమస్య తప్పినట్టైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కప్ క్రికెట్ ప్రారంభానికి ముందే టీమ్ ఇండియాకు ప్రయోజనం కలిగింది. టీమ్ ఇండియాకు అతి పెద్ద సవాలుగా మారిన పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఆసియా కప్‌కు దూరమౌతున్నాడు. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆగస్టు 28వ తేదీన ఉంది. 


పాకిస్తాన్‌కు చెందిన ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ షహీన్ షాహ్ అఫ్రిదీ గాయం కారణంగా ఆసియా కప్ నుంచి దూరమయ్యాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ 2021లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలను అవుట్ చేసి టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారకుడిగా మారిన బౌలర్ ఇతడే. గత నెల శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా షహీన్ షాహ్ అఫ్రిదీ మోకాలికి గాయమైంది. ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అందించిన సమాచారం ప్రకారం షహీన్ షాహ్ అఫ్రిదీకు ఆరు వారాల విశ్రాంతి అవసరం. అంటే అక్టోబర్ 2022లో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశాలున్నాయి.


ఆసియా కప్ 2022 కోసం పాకిస్తాన్ టీమ్ ఇదే


బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, ఫఖర్ జమా, ఇఫ్తికార్ అహ్మద్, హ్యారిస్ రవూఫ్, మొహమ్మద్ నవాజ్, ఖుష్‌దిల్ షాహ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, మొహమ్మద్ రిజ్వాన్, నసీమ్ షాహ్, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్.


Also read: IND vs ZIM Dream11 Prediction: భారత్‌ vs జింబాబ్వే డ్రీమ్ 11 టీమ్.. మ్యాచ్ టైమింగ్స్, స్ట్రీమింగ్ డీటెయిల్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook