Asia Cup 2023: క్రికెట్ ప్రేమికులకు పండుగగా భావించే ప్రపంచకప్ మెగా టోర్నీకు కొద్దిరోజుల ముందు రిహార్సల్‌గా ఆసియా కప్ 2023 ప్రారంభమైంది. శ్రీలంకలోని క్యాండీ వేదికగా ఇవాళ ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్ తన తుది జట్టును కూడా ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇవాళ మద్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇండియాకు ఇది తొలి మ్యాచ్ కావడంతో రెండు జట్లు సై అంటే సై అంటున్నాయి. వన్డే ఫార్మట్‌లో జరిగే ఆసియా కప్ కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. గత కొద్దికాలంగా టీమ్ ఇండియా చాలా ప్రయోగాలు చేస్తూ వస్తోంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, బూమ్రా వంటి ఆటగాళ్లకు గాయాలు కావడంతో కీలక ఆటగాళ్లు రోహిత్, కోహ్లీలకు విశ్రాంతినిస్తూ వచ్చింది. ఆసియా కప్ 2023ని ప్రీ ప్రపంచకప్‌గా భావిస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ రెండు జట్లూ ప్రపంచకప్ జట్టును ఖాయం చేసేందుకు ఆసియా కప్‌ను వేదికగా చేసుకుంటోంది. ఆల్ రౌండర్ జడేజా, హార్ధిక్ పాండ్యా, సిరాజ్, రోహిత్, విరాట్ వంటి సైన్యంతో ఇండియా సిద్ధమౌతోంది. 


ఇక గత కొద్దికాలంగా ఇంటా బయటా విజయాలతో బాబర్ ఆజమ్ సేన పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో ఫఖర్-ఇమామ్ జోడి నుంచి ఏడవ నెంబర్ వరకూ పాకిస్తాన్ బలంగా ఉందనే చెప్పాలి. అటు బౌలింగ్‌లో కూడా షాహిన్ ఆఫ్రిది, నసీమ్ షా, రవూఫ్‌తో పాటు స్పిన్‌లో షాదాబ్, నవాజ్ ఉండనే ఉన్నారు. అందుకే ఇవాళ్టి మ్యాచ్ నిజంగానే హై వోల్టేజ్ కానుంది. ఇండియా పాకిస్తాన్‌లో తలపడిన గత 5 వన్డేలు పరిశీలిస్తే ఇండియా 4 విజయాలు, పాకిస్తాన్ 1 విజయం సాధించాయి. ఆసియా కప్‌లో ఇండియాతో తలపడేందుకు పాకిస్తాన్ తన తుది జట్టును ప్రకటించింది.


పాకిస్తాన్ తుది జట్టు


బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్, ఆగా, సల్మాన్, ఇఫ్తికార్, షాదాబ్ ఖాన్, నవాజ్, షాహిన్ ఆఫ్రిది, నసీమ్ షా, రవూఫ్


ఇండియా అంచనా జట్టు


రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ లేదా షమీ, కుల్దీప్, సిరాజ్, బూమ్రా


Also read: India vs Pakistan Asia Cup 2023: ఈ ఆటగాళ్ల మధ్య బిగ్‌ఫైట్.. చూసేందుకు మీరు రెడీనా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook