India vs Bangladesh 2nd Test Highlights: రెండో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. బంగ్లా భరతం పట్టింది. ఏడు వికెట్లతో రెండో టెస్టులో విజయం సాధించి టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
Star Cricketer Rohit Sharma Car Collection: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రికెటర్లలో ఒకరు. వాణిజ్య ప్రకటనలు.. వ్యాపారాలతో భారీగా సంపాదిస్తున్న హిట్ మ్యాన్ వద్ద విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఆయన గ్యారెజ్‌లో ఉన్న కార్లు తెలుసుకుందాం.
India vs Bangladesh 1st Test Highlights: బంగ్లాపై తొలి టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 308 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ నాటౌట్ అయినా.. పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వగా.. రివ్యూ కోరకుండానే వెళ్లిపోయాడు. రిప్లైలో నాటౌట్‌గా తేలింది.
Ind Vs Ban 1st Test Score: తొలి టెస్టులో బంగ్లా యువ బౌలర్ హసన్ మహమూద్ దుమ్ములేపే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. నాలుగు వికెట్లతో చెలరేగి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, పంత్ కీలక వికెట్లు తీయడం విశేషం.
Mumbai Indians Did Not Retain Hitman Says Former Cricketer Aakash Chopra: ఐపీఎల్ మెగా వేలం ముందు భారీ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ముంబైని వీడనున్నాడనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
Ind Vs SL 3rd Odi: శ్రీలంకతో మూడో వన్డేకు టీమిండియాలో కీలక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. శివమ్ దూబే స్థానంలో రిషబ్ పంత్‌ను ఆడించేందుకు రోహిత్ శర్మ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రెండు వన్డేల్లోనూ దూబే కీలక సమయాల్లో ఔట్ అయిన విషయం తెలిసిందే.
No Blame To Arshdeep Singh Tie With Sri Lanka First ODI: టీ 20 సిరీస్‌ను సొంతం చేసుకుని విజయోత్సాహంతో వన్డే సిరీస్ ప్రారంభించిన భారత జట్టుకు శ్రీలంక ఊహించని షాక్ ఇచ్చింది. మ్యాచ్ డ్రాగా ముగియడంతో భారత అభిమానులు అర్షదీప్ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ అక్కడ జట్టు మొత్తం వైఫల్యం చెందిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Ind vs SL 1st ODI Highlights and Super Over Rules: టీ20 సిరీస్ గెలిచి ఊపుమీద ఉన్న భారత్‌కు తొలి వన్డేలో శ్రీలంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ను శ్రీలంక అద్భుతంగా పోరాడి టైగా మార్చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. అంతేస్కోరుకు ఆలౌట్ అయింది. కెప్టెన రోహిత్ శర్మ (58) హాఫ్ సెంచరీతో రాణించగా.. మ్యాచ్ టై అయిన సమయంలో శివమ్ దూబే (25) ఔట్ అవ్వడం, ఆ తరువాతి బంతికే అర్ష్‌దీప్ సింగ్ (0) డకౌట్ కావడంతో మ్యాచ్ ఊహించని విధంగా డ్రాగా ముగిసింది.
Rohit Sharma Wife Ritika Sajdeh: ఆమె టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత మరో టీమిండియా స్టార్ క్రికెటర్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ వుమెన్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఇంతకు ఎవరు ఆమె అనుకుంటున్నారా..? ఇక్కడ ఆమె చిన్ననాటి ఫోటో ఉంది.. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో ఊహించగలరా..?
Rohit Sharma Mumbai Indians: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుంది..? ఎవరిని రిలీజ్ చేస్తుంది..? అనేది ఆసక్తిగా మారింది. ఇక ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు రోహిత్ శర్మ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్ వేలంలోకి వస్తే భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. భారీ మొత్తంలో రోహిత్ శర్మ కోసం ఖర్చు చేసేందుకు టీమ్‌లు రెడీగా ఉన్నాయి.
Akshar Patel Interview: టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలవడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్లో సంబరాలు చేసుకున్నారు. ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై ఉత్కంఠభరిత పోరులో గెలుపొందింది. ఓ దశలో క్లాసెన్ సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్ ఓడిపోతుందని భయం ఫ్యాన్స్‌లో మొదలైంది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లాసెన్ దంచికొట్టాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ సఫారీ చేతుల్లోకి వెళ్లినట్లు అయింది. కానీ హార్థిక్ పాండ్యా క్లాసెన్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.
BCCI Announces Prize Money 125 Cr For Indian Team: ఎన్నో ఏళ్ల తర్వాత ప్రపంచకప్ సాధించిన భారత జట్టుపై కానుకల వర్షం కురిసింది. ప్రపంచ విజేత టీమిండియాకు భారీ నగదు బహుమతి లభించింది.
Star All Rounder Ravindra Jadeja Retires From T20I: క్రికెట్లో తన స్నేహితుల వెంటనే రవీంద్ర జడేజా తన ఆటకు ముగింపు పలికాడు. కోహ్లీ, రోహిత్ బాటలోనే జడ్డూ తన టీ20 ఆటకు వీడ్కోలు చెప్పేశాడు.
Team India T20 World Cup Prize Money: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు రూ.రూ.20.42 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా రూ.10.67 కోట్లు అందుకుంది. సెమీస్‌కు చేరిన అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ జట్లకు రూ.6.56 కోట్లు దక్కింది.
Rohit Sharma Emotional Video: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. హిట్‌మ్యాన్ కన్నీళ్లు పెట్టుకోగా.. విరాట్ కోహ్లీ భుజంపై చేయి వేసి సముదాయించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Gautam Gambhir Comments About BCCI Head Coach Post: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ పదవిపై కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ పదవి లభిస్తే గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తాను పోటీకి అర్హుడినని తెలిపారు.
Rohit Sharma And Virat Kohli in T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారనుంది. రోహిత్ శర్మకు తోడుగా విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో యశస్వి జైస్వాల్‌కు తుది జట్టులో ప్లేస్ కష్టమవుతుంది.
IPL 2024 Lucknow Super Giants Beat Mumbai Indians By 18 Runs In Wankhede: తన ఆఖరి మ్యాచ్‌లోనూ ఓటమి చెంది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముంబై ఇండియన్స్ బై బై చెప్పేసింది. వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై లక్నో సూపర్ జియాంట్స్ విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.