Axar Patel Injury: సెప్టెంబరు 17న భారత్, శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కొలంబో పి. ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం జరిగే ఈ తుదిపోరులో గెలిచేందుకు రెండు జట్లు చెమటొడిస్తున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది.  ఈ మ్యాచ్ కు స్పిన్నర్ అక్షర్​ పటేల్​ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్షర్ బంగ్లాతో జరిగిన మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. అతడి చిటికెన వేలు, మోచేయికి తీవ్రంగా గాయాలయ్యాయి. అక్షర్ స్థానంలో ఆల్ రండర్ వాషింగ్టన్ సుందర్ ను ఆడించాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. పైనల్ మ్యాచ్ జరిగే పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో సుందర్ ను బీసీసీఐ శ్రీలంకకు రప్పించినట్లు సమాచారం. అయితే అతడు తుది జట్టులో ఉంటాడా లేదా అనేది అనుమానమే. 


ఆసియా కప్ లో భారత్ కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటి వరకు టీమిండియా అత్యధికంగా ఏడు సార్లు ట్రోఫీని గెలుచుకుంది. తాజాగా ఎనిమిదో టైటిల్ పై కన్నేసింది.  శ్రీలంక ఇప్పటి వరకు ఆరు టైటిళ్లు నెగ్గింది. ఇప్పుడు మరోసారి ట్రోఫిని ముద్దాడి భారత్ రికార్డును సమం చేయాలని చూస్తోంది. మరోవైపు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ''ట్రోఫీ టూర్'' పేరుతో ఆసియా కప్ ట్రోఫీని కొలంబో నగర వీధుల్లో తిప్పుతోంది. కప్ తో సెల్పీ తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. 


ఆసియా కప్ ఫైనల్ జట్లు (అంచనా):
భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమర విక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.


Also read: Asia Cup Final 2023: రేపే ఆసియా కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే విజేతలు వీళ్లే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook