ఇండోనేషియాలోని జకార్తాలో 8వరోజు జరుగుతున్న ఆసియా క్రీడలు 2018లో భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్‌ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భాగంగా సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో సైనా ఓటమి చవిచూసింది. సైనా.. తన సమీప ప్రత్యర్థి, ప్రపంచ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి తైజు యింగ్‌(చైనీస్‌ తైపీ)తో తలపడి ఓటమిపాలయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తైజుయింగ్‌ చేతిలో 17-21, 14-21 తేడాతో సైనా ఓడిపోయారు. ఆట ప్రారంభం నుంచి ప్రత్యర్థికి గట్టి పోటీనిస్తూ.. పాయింట్లను సమం చేస్తూ సైనా పోరాడింది. అయితే.. ప్రత్యర్థి వేగం పుంజుకోవడంతో సైనా ఓటమి పాలయ్యారు. సెమీఫైనల్‌ ఓటమితో సైనా ఈ క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే.. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో మెడల్ గెలిచిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనా చరిత్ర సృష్టించింది.


ఇక మరోవైపు ఉమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో పీవీ సింధు జపాన్‌కు చెందిన అకానీ యమగుచితో వీరోచితంగా తలపడుతున్నది.