Asian Games 2023: చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్  2023లో భారత్ 100 పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు జరిగిన ఏషియన్ గేమ్స్  లలో 100 పథకాలు భారత్ సాధించటం ఇదే మొదటిసారి. భారత అట్లెట్స్ ఈ రోజు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ.. మెడల్స్ సాధించటంలో ముందుకు దూసుకుపోతున్నారు. క్రికెట్ లో గోల్డ్ మెడల్ కోసం భారత్ ఈ రోజు ఆడనుంది. అంతేకాకుండా రెజిలింగ్ మ్యాచ్ లు కూడా జరగనున్నాయి. చారిత్రాత్మక ప్రదర్శన కనబర్చిన భారత క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ఇదొక చిరస్మరణీయ విజయం! భారత్ అథ్లెట్స్ సాధించిన 100 పతకాలతో గర్వించదగిన మైలురాయిని చేరుకున్నందుకు భారతదేశ ప్రజలు పులకించిపోయారు. దేశానికి ఈ చారిత్రక మైలురాయి చేరుకోటానికి కారకులైన మా అసాధారణ క్రీడాకారులకు నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి విస్మయం -స్పూర్తిదాయకమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించి మా హృదయాలను గర్వంగా నింపింది. 10వ తేదీన ఆసియా క్రీడకారుల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి మరియు మా అథ్లెట్లతో సంభాషించడానికి నేను ఎదురుచూస్తున్నాను" అని ప్రధాని మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 




ఈ రోజు 19వ ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ ఆర్చరీలో భారత క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడంతో భారత్ సానుకూలంగా ప్రారంభించింది. శనివారం హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ అదితి గోపీచంద్ స్వామి మహిళల కాంపౌండ్ ఆర్చరీ మహిళల వ్యక్తిగత ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు, కబడ్డీలో మహిళల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.


Also Read: YSRTP vs Congress: కాంగ్రెస్‌లో విలీనానికి తెర, ఇక ఒంటరిగానే తెలంగాణ ఎన్నికల బరిలో


దీంతో భారత్ స్వర్ణ పథకాల సంఖ్య 25కి,  మొత్తం పతకాల సంఖ్య 100కి చేరుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతక పోరులో చైనీస్ తైపీపై భారత మహిళల కబడ్డీ జట్టు 14-9 ఆధిక్యంలో నిలిచింది. హాంగ్‌జౌలో జరిగిన ఓపెనర్‌లో రెండు జట్లు 34-34తో టై అయ్యాయి. తొలి అర్ధభాగంలో భారత రైడర్లు ఆరు బోనస్ పాయింట్లు సాధించారు.


మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు హాంగ్‌జౌలో జరిగే 19వ ఆసియా క్రీడల్లో పురుషుల కబడ్డీ ఫైనల్‌లో భారత్ మరియు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తలపడనున్నాయి. ప్రస్తుతం భారత్ మొత్తం 100 పతకాలతో పతకాల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.


Also Read: Jawan OTT Release: జవాన్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్, ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook