Asian Wrestling Championships: ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత రెజ్లర్లు.. రవికుమార్‌కు గోల్డ్, పునియాకు సిల్వర్
Asian Wrestling Championships: ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు రెచ్చిపోయారు. స్టార్ రెజ్లర్ రవి కుమార్ దహియా గోల్డ్ మెడల్ సాధించగా.. బజరంగ్ పూనియా సిల్వర్ తో మెరిశాడు.
Asian Wrestling Championships 2022: ఆసియా ఛాంపియన్‌షిప్ రెజ్లింగ్ పోటీల్లో (Asian Wrestling Championships 2022) గోల్డ్ మెడల్ సాధించాడు ఒలింపిక్స్ రజత పతక విజేత రవికుమార్ దహియా. దీంతో వరుసగా ఈ పోటీల్లో మూడోసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకొని హ్యాట్రిక్ సాధించిన ప్లేయర్ గా నిలిచాడు.
శనివారం జరిగిన పురుషుల 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో కజకిస్థాన్ రెజ్లర్ రఖత్ కల్జాన్‌ను 12-2 తేడాతో ఓడించి..స్వర్ణ పతకాన్ని సాధించాడు రవి దహియా. ఈ సీజన్లో రవి దహియాకు ఇది రెండో మెడల్. గత ఫిబ్రవరిలో జరిగిన డాన్ కొలావ్ పోటీల్లో అతడు సిల్వర్ మెడల్ ను సాధించాడు. గతంలో 2020లో దిల్లీ, 2021లో అల్మాటిలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడు రవి దహియా.
ఈ పోటీల్లో మరో భారత రెజ్లర్ బజరంగ్ పునియా రజత పతకాన్ని సాధించాడు. 65 కేజీల కేటగిరీలో పోటీపడ్డ బజరంగ్.. ఇరాన్ రెజ్లర్ రెహ్మాన్ మౌసా చేతిలో మట్టికరిచాడు. తుదిపోరులో 1-3తో ఓటమి పాలయ్యి...సిల్వర్ తో సరిపెట్టుకున్నాడు. ఇంకో భారత రెజ్లర్ నవీన్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. 70 కిలోల విభాగంలో మంగోలియా రెజ్లర్ ను ఓడించాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో అన్షుమాలిక్(57 కేజీలు), రాధిక(65 కేజీలు)లు రజత పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.
Also Read: Wankhade Stadium: వాంఖడే స్డేడియంలో ఛీటర్..ఛీటర్ నినాదాలు, పంత్ అసహనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook