Wankhade Stadium: ఐపీఎల్ 2022లో ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో తలెత్తిన నో బాల్ లొల్లి సంచలనంగా మారింది. స్డేడియంలో ప్రేక్షకులు ఛీటర్..ఛీటర్ అంటూ స్లోగన్లతో మార్మోగించారు.
ఆ అద్భుతం జరిగుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఒక సంచలనాత్మక విజయం నమోదై ఉండేది. ఐపీఎల్ 2022లో నిన్న అంటే శుక్రవారం జరిగిన 34 వ మ్యాచ్ విశేషమది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ చివరివరకూ ఉత్కంఠగానే సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ధాటిగా ఆడింది. ఆర్ఆర్ బ్యాటర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఆ తరువాత 223 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ కేపిటల్స్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ చివరివరకూ పోరాడింది. తరచూ వికెట్లు పోగొట్టుకుంటూ రన్‌రేట్ స్ట్రైక్ పెంచేసుకుంది.
ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. ఎందుకంటే చివరి ఓవర్ మిగిలింది. ఆరు బంతుల్లో..36 పరుగులు చేయాలి. అనితర సాధ్యమైన టార్గెట్ ఇది. అంతే అప్పుడే ఓ అద్భుతం ప్రారంభమైంది. పోవెల్ తొలి మూడు బంతుల్ని మూడు సిక్సర్లుగా మలిచాడు. మరోసారి ఢిల్లీ కేపిటల్స్ జట్టులో ఆశలు చెలరేగాయి. అదే ఊపు కొనసాగుంటే పోవెల్ మరో మూడు సిక్సర్లు కూడా కొట్టేవాడేమో. అప్పుడో లొల్లి ప్రారంభమైంది. మూడవ బంతి ఛాతీ వరకూ వచ్చినట్టుగా కన్పించింది. నిబంధనల ప్రకారం నో బాల్ ఇవ్వాలి. అంటే ఫ్రీ హిట్ లభిస్తుంది ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు. ఆ క్షణంలో ఆ సమయంలో ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు చాలా అవసరమది. అంపైర్ అదేమీ పట్టించుకోలేదు. దాంతో పోవెన్ అసహనానికి గురయ్యాడు. ఇటు డగౌట్‌లో ఉన్న పంత్ సహా ఇతర ఆటగాళ్లు కూడా అభ్యంతరం తెలిపారు. అంతేకాదు ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తన ఆటగాళ్లను వెనక్కు వచ్చేయాల్సిందిగా సైగలు కూడా చేశాడు.
అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేను గ్రౌండ్‌లో కి పంపి..నో బాల్ చెక్ చేయాల్సిందిగా అంపైర్‌ను కోరాడు. కానీ అంపైర్లు తమ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. గ్రౌండ్‌లో కాస్సేపు గందరగోళం నెలకొంది. అదే సమయంలో గ్రౌండ్ అంతా ఛీటర్..ఛీటర్ అంటూ నినాదాలు విన్పించాయి. ప్రేక్షకుల దృష్టిలో కూడా అంపైర్ నిర్ణయాలు జోక్‌గా మిగిలిపోతున్నాయి.
Watched the match live in stadium!!!!
Crowd goes absolute bonkers over “no ball” and chanted “cheater cheater” in Wankhede!!
The clip of Rishabh Pant post match anger with Umpires#DCvsRR #cheater #RishabhPant #IPL2022 #ipl #noball #RR #wankhede #HallaBol #bcci # pic.twitter.com/RcrBlxVgxE
— Aman Jain (@amanj0104) April 22, 2022
Also read: SRH vs RCB: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎవరిది పైచేయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.