Chance of Rain in India  vs New Zealand 1st ODI 2022 Match: ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20 సిరీస్ పూర్తికాగా, వన్డే సిరీస్‌ శుక్రవారం ఆరంభం కానుంది. టీ20 సిరీస్‌లోని రెండు మ్యాచులు వర్షార్పణం కాగా.. రెండో టీ20 మాత్రమే సజావుగా సాగింది. ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదికగా రేపు ఉదయం జరగనున్న తొలి వన్డేకు వరుణుడి ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే గత కొన్ని రోజులుగా ఆక్లాండ్‌లో వర్షం కురుస్తున్నప్పటికీ.. రెండు రోజులుగా కాస్త మెరుగైన పరిస్థితి ఉందట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి వన్డే మ్యాచ్‌ సమయానికి వర్షం పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని  ఆక్లాండ్‌ వాతావరణ శాఖ పేర్కొంది. మ్యాచ్‌ సమయానికి 20 శాతం మాత్రమే వర్షం పడే అవకాశం ఉందట. గాలిలో 62 శాతం తేమ ఉంటుందని, గంటకు 32 కిమీ వేగంతో గాలి వీచే అవకాశం ఉందని చెప్పింది. గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వరణుడిపై ఫాన్స్ చాలా గుర్రుగా ఉన్నారు. వరుణుడి కోసమే ఈ టూర్ ఏర్పాటు చేసినట్లుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. 


న్యూజిలాండ్‌ సిరీస్‌లకు భారత సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, ఆర్ అశ్విన్, మొహ్మద్ షమీలకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌ పర్యటనకు భారత్ వెళ్లనుంది. బంగ్లాతో 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనతో సీనియర్ ప్లేయర్స్ తిరిగి జట్టులో చేరనున్నారు. రోహిత్‌ గైర్హాజరీలో న్యూజిలాండ్‌ టీ20లకు హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ చేపట్టగా.. వన్డేలకు శిఖర్‌ ధావన్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు.


భారత్ తుది జట్టు (అంచనా): 
శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్. 


Also Read: Kriti Sanon Pics: బటన్స్ విప్పేసిన కృతి సనన్.. అంతా కనబడేలా హాట్ స్టిల్స్!


Also Read: Payal Rajput Photos: పొట్టి నిక్కరులో పాయ‌ల్ పాప.. కుర్రాళ్ల గుండెల్లో మంటలు ఖాయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.