David Warner Pushpa Celebrations: భారత గడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన ఆసీస్ జట్టు.. వన్డే సిరీస్‌ను గెలుచుకుని ఉత్సాహంగా సంబురాలు చేసుకుంటోంది. చెన్నైలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి సిరీస్‌ని కైవసం చేసుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ 2-1తో కైవసం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత భారత జట్టు సొంత గడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అంతకుముందు 2019లో టీమిండియా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియా చేతిలో 5 వన్డేల సిరీస్‌లో 3-2 తేడాతో ఓడిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా వన్డే సిరీస్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ 'పుష్ప' స్టైల్‌లో విజయోత్సవం జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వన్డే సిరీస్ ట్రోఫీని కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేతికి అందించిన వెంటనే.. జట్టులోని ఆటగాళ్లు విభిన్నంగా విజయాన్ని సంబరాలు చేసుకున్నారు. ఈ సమయంలో వార్నర్ తనకు తెలిసిన 'పుష్ప' శైలిలో తగ్గేదేలే అంటూ స్టిల్ ఇచ్చాడు. ఈ స్టైల్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.  


సోషల్ మీడియాలో వార్నర్ భాయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకు ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినా.. భారత్‌లో వార్నర్‌కు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. గ్రౌండ్‌లో తన ఆటతోనే కాకుండా.. సోషల్ మీడియాలో వీడియోల ద్వారా కూడా వార్నర్ అలరిస్తుంటాడు. కోవిడ్ లాక్‌​డౌన్ సమయంలో వార్నర్​ తెలుగు పాటలకు స్టెప్పులేసి అభిమానులను మెప్పించాడు. మాస్​ డైలాగులు కూడా పేల్చాడు. బుట్ట బొమ్మ పాటకు వార్నర్ వేసిన స్టెప్పులు అప్పట్లో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. తెలుగుతో పాటు ఇతర భాష పాటలు, ఫ్యాన్స్​ ఎడిట్​ చేసిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా పుష్ప స్టైల్‌లో వార్నర్ ఇచ్చిన స్టిల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వార్నర్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోనూ పుష్పలో అల్లు అర్జున్ తరహాలో వాకింగ్ చేశాడు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


 




ఆసీస్ పర్యటన ఇలా సాగింది.. 


భారత పర్యటనలో ఆస్ట్రేలియా 4 టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడింది. టెస్టు సిరీస్‌లో కంగారూలను 2-1 తేడాతో టీమిండియా ఓడించింది. ఇండోర్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో, ఢిల్లీలో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అహ్మదాబాద్‌ టెస్టు డ్రాగా ముగిసింది. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. కాగా చెన్నైలో జరిగిన మూడో మ్యాచ్‌లో కంగారూలు 21 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకున్నారు. 


Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. ఎంపీ సభ్యత్వం రద్దు..?   


Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కథ ముగిసే.. మూడో వన్డేలోనూ గోల్డెన్ డక్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook