Shane Warne Death: క్రికెట్ దిగ్గజం, లెగ్ స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియన్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ మృతి చెందాడు. తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్టు సమాచారం. షేన్ వార్న్ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెట్ ఆటను ప్రేమించవాళ్లకు షేన్ వార్న్ తెలియని పేరు కాదు. అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్‌మెన్లను ముప్పు తిప్పలు పెట్టడంలో దిట్ట. లెగ్ స్పిన్ మాంత్రికుడిగా పేరుగాంచిన ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాడు షేన్ వార్న్ హఠాన్మరణం చెందాడు. థాయ్‌లాండ్‌లోని తన ఇంటిలో తీవ్ర గుండెనొప్పితో ఇబ్బంది పడి మరణించనట్టు తెలుస్తోంది. థాయ్‌లాండ్‌లోని తన సొంత విల్లాలో అచేతనంగా పడి ఉన్న షేర్ వార్న్‌ను..విల్లా సిబ్బంది ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆసుపత్రికి వెళ్లేటప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. షేన్ వార్న్ మరణవార్త మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


షేన్ వార్న్ క్రికెట్ చరిత్రలో మైలురాళ్లు, రికార్డులు


ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్..1992లో టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచ్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. క్రికెట్ కెరీర్‌లో మొత్తం 145 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు సాధించాడు. అటు వన్డేల్లో కూడా 194 మ్యాచ్‌లలో293 వికెట్లు పడగొట్టాడు. మొత్తం క్రికెట్ కెరీర్‌లో వేయి వికెట్లు తీసిన రెండవ ఆటగాడు ఇప్పటికే అతడే. తొలిస్థానంలో శ్రీలంకకు చెందిన మరో స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు.


ఐపీఎల్ 2008లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా


2008 ఐపీఎల్ ప్రారంభంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షేన్ వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించడమే కాకుండా ఆ జట్టుకు టైటిల్ సాధించిపెట్టాడు. 1999లో ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్‌లో కీలక సభ్యుడు. క్రికెట్ ప్రపంచంలో లెక్కలేనన్ని రివార్డులు సొంతం చేసుకున్న షేన్ వార్న్..టెస్ట్ మ్యాచ్‌లలో 37 సార్లు 5 వికెట్ల్ ఖ్యాతి సాధించగా..2013లో హాల్ ఆఫ్ ఫేమ్‌గా నిలిచాడు.


స్పిన్ మాయాజాలం


షేన్ వార్న్ స్పిన్‌ను ఎదుర్కోవడమంటే మాటలు కాదు. నిజంగా ఓ అద్భుతమైన స్పెల్ అతనిది. బౌల్ చేతి నుంచి జారిన తరువాత..ఎటు నుంచి ఎలా తిరుగుతుందో కాస్సేపు అర్ధం కాదు. అర్ధమయ్యేలోగా వికెట్ ఎగురేసుకుని పోతుంది. బ్యాట్స్‌మెన్ చూస్డూ ఉండిపోవడం తప్ప ఏం చేయలేని నిస్సహాయతకు లోనవుతాడు. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఒక్కడే షేన్ వార్న్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేవాడని అందరూ చెబుతుంటారు.


[[{"fid":"223805","view_mode":"default","fields":{"format":"default"},"type":"media","field_deltas":{"1":{"format":"default"}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read: Shane warne death:దిగ్గజ క్రికెటర్​ షేన్ వార్న్​ ఇక లేరు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook