Glenn Maxwell Engagement: లవ్ ప్రపోజ్ కన్నా వరల్డ్ కప్ ఫైనల్ ఆడటం తేలిక: గ్లెన్ మ్యాక్స్‌వెల్
తాను ఇలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ప్రపంచ కప్ ఫైనల్ ఆడటం కన్నా ఎక్కువ ఒత్తిడికి లోనయ్యానని అంటున్నాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్
మెల్‌బోలర్న్: ప్రేమ.. సెలబ్రిటీ అయినా, సామాన్యులు అయినా ఈ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. తమ ప్రేమను వ్యక్తం చేయగా అంగీకరిస్తే ఓకే, లేనిపక్షంలో ఫ్రెండ్‌షిప్, అప్పటివరకూ ఉన్న రిలేషన్ దెబ్బ తింటుందన్న భయాలు ఉంటాయి. తాను ఇలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచ కప్ ఫైనల్ ఆడటం కన్నా ఎక్కువ ఒత్తిడికి లోనయ్యానని అంటున్నాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. ప్రేయసికి తన ప్రేమను వ్యక్తం చేయడంలో మూడుసార్లు విఫలం కాగా, నాలుగో ప్రయత్నం విజయం సాధించానని మ్యాక్సీ తెలిపాడు. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
ప్రేమను వ్యక్తం చేశాక, రిజెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఆలోచించి తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, పీడకలలు సైతం వేధించాయని మ్యాక్స్‌వెల్ తన మనసులో మాటల్ని బయటపెట్టాడు. భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో ఇటీవల మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం జరిగింది. తొలుత మ్యాక్సీకి సంబంధించిన తీరుగా, ఆపై భారత సంప్రదాయంలోనూ ఎంగేజ్‌మెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. శభాష్.. భారత సంప్రదాయంలో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం
‘నా గాళ్ ఫ్రెండ్ వినీ రామన్‌కి ప్రపోజ్ చేయడానికి నాలుగు పథకాలు రూపొందించాను. తొలి ప్లాన్‌లో భాగంగా పార్కులో ప్రపోజ్ చేయాలనుకున్నాను. కానీ అక్కడ పిల్లలు ఆడుకోవడం, పెద్దవాళ్లు వాకింగ్, కుక్కల అరుపులతో వీలు కాలేదు. రెండో ప్లాన్‌లో భాగంగా లంచ్‌కు తీసుకెళ్లి రింగ్ తొడిగి ప్రేమను చెప్పాలనుకున్నా. తెలిసినవారు ఉండటంతో మళ్లీ ఫెయిలయ్యా. మూడో ప్లాన్‌లో భాగంగా అమ్మాలు ఇష్టపడే ఎర్రటి గులాబీల మధ్యకు తీసుకెళ్లి మనసులో మాటను చెబుతామని భావించా. కానీ వీలు కాలేదు. See Pics: మ్యాక్స్‌వెల్ ఎంగేజ్ మెంట్ ఫొటోలు వైరల్
ఇక లాభం లేదని చివరి ప్లాన్ అమలు చేశాను. వినీని పార్కుకు పిలిచాను. నేను ఉన్న లోకేషన్ తనకు పంపించాను. తను నా వెనకాలే వేరే కారులో వచ్చింది. తన రాకకోసం నేను మోకాలిపై నిల్చుని ఎదురుచూస్తున్నాను. తను రావడం కాస్త ఆలస్యమైంది. ఆమె నుంచి కాల్ వచ్చింది. ఆమె దూరం నుంచి చూస్తూనే ఏంటి ఇది అని అడిగింది. ప్రేమ విషయాన్ని చెప్పగానే తాను ఆనంద భాష్పాలు రాల్చింది. 7నిమిషాల నిడివిఉన్న వాయిస్ మెయిల్‌లో నా ప్రేమను అంగీకరించింది. ఇప్పటికీ ఆ వాయిస్ మెయిల్ నా ఫోన్‌లో ఉందని’ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడో చక్కగా వివరించాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..